నిజామాబాద్

ప్రజాసంక్షేమం పట్టని టీఆర్‌ఎస్ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీబీపేట్, నవంబర్ 15: టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్‌అలీ ఆరోపించారు. గురువారం మండలంలోని తుజాల్‌పూర్, దీవిబీబీపేట్, యాడారం, కోణాపూర్, మల్కాపూర్ గ్రామాల్లో ఆయన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య కూడళ్లలో ప్రజలను ఉద్ధెశించి మాట్లాడుతూ, గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాల్గున్నర ఏళ్లలో సామాన్య ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రైతుల రుణామాఫి ఫైల్‌పై తొలి సంతకం చేస్తామని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏది అమలు చేయలేదని ఆరోపించారు. పేదలకు ఇండ్లు లేనివారికి డబుల్ బెడ్‌రూంల ఆశ చూపించి ఎక్కడ కట్టించారని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించామని అన్నారు. రైతుబందు పథకం కింద రైతులకు పంట పెట్టుబడి సహాయం బ్యాంకు ఖతాల ద్వారా ఇస్తే రైతుల పాత అప్పుల కింద జమ చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు నాల్గు దఫాలుగా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే రైతులకు ఎలాంటి లాభం లేదని అన్నారు. పైగా బ్యాంకు నుండి రైతులకు అన్ని క్లియర్ అయినట్లు ఏ ఒక్క రైతుకు నోడ్యూ సర్ట్ఫికెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం తమ మాటల గారడీతో ప్రజలన్ని అయోమయానికి గురి చేస్తుందని అన్నారు. రాబోయే కాంగ్రెస్ పాలనలో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి రూపాయల పింఛన్ రెండువేలకు పెంచుతామని 58 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్‌లు అందిస్తామని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీడీ కార్మికుల పరిస్థితి ధీనంగా తయారైందన్నారు. పరిశ్రమలు నిలదొక్కుకోలేని పరిస్థితులు ఉన్నా కార్మికులకు ప్రత్యామ్నయ చర్యలు ఏం తీసుకోవడం లేదని అన్నారు. తాము అధికారంలో వచ్చిన వెంటనే ఇండ్లు లేని నిరుపేదలుసొంత ఇంటి స్థలాల్లో ఇళ్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయల సహాయం అందిస్తామని అన్నారు. గత కాంగ్రెస్ హయాంలో నిరుపేదలకు 11రకాల రేషన్ సరకులు అందించామని, ప్రస్తుతం కేవలం రేషన్ షాపుల్లో బియ్యం, కిరోసీన్‌లు మాత్రం ఇస్తున్నారని తాము అధికారంలో వచ్చిన వెంటనే సంవత్సరానికి ఆరు వంట గ్యాస్ సీలిండర్లు ఒక్కో కుంటుంబానికి ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఈకార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మెన్ ఎడ్ల రాజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేణుగోపాల్‌గౌడ్, ఎంపిటీసీ లక్ష్మీవిఠల్, బీబీపేట్ కాంగ్రెస్ మండల ఆధ్యక్షుడు భూమాగౌడ్, సుతారీ రమేష్, వివిధ గ్రామాల అధ్యక్షుడు గోకరాజు, పిడుగు స్వామి, విజయ్‌కుమార్, ఉప్పల సాయినాత్, అరుణశర్మ, స్థానిక నాయకులు, ఆయన వెంట ఆయా గ్రామాల రైతులు, బీడి కార్మికులు, ప్రజలు, భారీ సంఖ్యలో హాజరయ్యారు.