నిజామాబాద్

కెసిఆర్ ఇంటికి పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, మే 26: ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జూన్ 5వ తేది నుంచి చింతమడక గ్రామం నుంచి హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంటి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ చెప్పారు. గురువారం ఆర్మూర్‌లోని రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కెసిఆర్ స్వగ్రామమైన చింతమడక నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నామని, జూలై 10న కెసిఆర్ ఇంటి ఎదుట ప్రదర్శన నిర్వహిస్తామన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్న డిమాండ్ మేరకు పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఒత్తిడి పెంచుతూనే కేంద్ర ప్రభుత్వంపై దండయాత్ర నిర్వహించడానికి ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బిజెపి మాటపై నిలబడాలని ఎంపి కవిత చెప్పిన మాటలను స్వాగతిస్తున్నామని, అయితే టిఆర్‌ఎస్ పార్టీ కూడా తాను ఇచ్చిన మాటలపై నిలబడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతరులకు నీతులు చెప్పడం కాదని, స్వయంగా ఆచరించాలని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం న్యాయమని చెప్తున్న ఎంపి కవిత పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాలపై ఎంపి కవిత సమాధానం ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎస్సీ వర్గీకరణపై వౌనం వీడాలని అన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు వర్గీకరణపై అనుకూలమా, వ్యతిరేకమా చెప్పలేదని అన్నారు.