నిజామాబాద్

గుంతలో పడి ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, మే 30: ఆదిలాబాద్ జిల్లా, కడెం మండలంలోని గొడిసిర్యాల గ్రామంలో రాజరాజేశ్వరస్వామి ఆలయానికి నిజామాబాద్ జిల్లాలోని జక్రామ్‌పెల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన పుచ్చల నరేష్(25), ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గుండ నాగేంద్రస్వామి (23) అనే యువకులు రాజన్న స్వామి దర్శనానికి వచ్చి సోమవారం మధ్యాహ్నం ఆలయ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలోపడి మృతిచెందారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... నిజామాబాద్ జిల్లాలోని జక్రామ్‌పెల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన పుచ్చల నరేష్, ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గుండ నాగేంద్రస్వామి తమ కుటుంబ సభ్యులతో రెండు ఆటోలలో ఆదివారం రాత్రి గొడిసిర్యాల గ్రామంలో గల రాజేశ్వర స్వామి ఆలయానికి తరలివచ్చారు. కాగా సోమవారం నాగేంద్రస్వామి కుటుంబ సభ్యులు ఆలయంలో రాజన్న స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో పుచ్చల నరేష్, గుండ నాగేంద్రస్వామి ఇద్దరు యువకులు ఆలయ సమీపంలో ఉన్న బత్తుల రాజన్నకు చెందిన వ్యవసాయ బావికి స్నానం కోసం వెళ్లారు. ఆ సమయంలో నరేష్ స్నానం చేయడానికి బావి నీటిలోకి వెళ్లి మునగగా అతనితో వచ్చిన నాగేంద్రస్వామి కూడా అతనిని కాపాడడానికి బావిలో దూకాడు. నరేష్‌ని బయటికి లాగే ప్రయత్నంలో నరేష్‌కు ఈతరాకపోవడం, గుండ నాగేంద్రస్వామిని నీటిలో గట్టిగా పట్టుకోవడంతో నీటిని నుండి బయటకు రాలేక అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆలయం వద్ద ఉన్న కుటుంబ సభ్యులు వ్యవసాయ బావి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. దైవ దర్శనానికి తరలివచ్చి ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందడం వారి కుటుంబంలో విషాదం నింపింది. సంఘటన స్థలానికి కడెం ఎస్సై ఆరిఫొద్దిన్ సందర్శించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని కడెం మండల తహసిల్దార్ నర్సయ్య, దస్తురాబాద్ రెవెన్యు ఇన్స్‌పెక్టర్ రవీందర్ సందర్శించారు.