నిజామాబాద్

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, మే 30: నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు పోలీసు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని డిఐజి, నిజామాబాద్ రేంజ్ ఇంచార్జ్ డిఐజి అకున్ సబర్వాల్ సూచించారు. అకున్ సబర్వార్ నిజామాబాద్ రేంజ్ ఇంచార్జ్ డిఐజిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం మొదటిసారిగా జిల్లా చేరుకుని, పోలీసు కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరించి, అధికారులతో సమావేశమయ్యారు. ముందు జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలతో పరిచయ కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే కమ్యూనల్ ఇష్యూలు, నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలు, రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తీసుకోవల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు. రాత్రి సమయాల్లో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, మోటార్ వాహనాల యాక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ పి.విశ్వప్రసాద్, అదనపు ఎస్పీ ప్రతాప్‌రెడ్డి, డిఎస్పీలు ఆనంద్‌కుమార్, భాస్కర్, ఆకుల రాంరెడ్డి, వెంకటేశ్వర్లు, వరప్రసాద్, రవీందర్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఎమ్.మునితో పాటు అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.