నిజామాబాద్

జంట హత్యల కేసును సిబిసిఐడికి అప్పగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, జూన్ 3: ఎడపల్లి మండలం జానకంపేట్ దర్గాలో 2014 ఏప్రిల్ 22వ తేదీ అర్ధరాత్రి జరిగిన భార్యభర్తల దారుణ హత్య కేసును సిబిసిఐడికి అప్పగించి, నిందితులను గుర్తించేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతూ ఇండియన్ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్పీ విశ్వప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షుడు ఎంఎ.ముఖీద్ ఫారూఖీ మాట్లాడుతూ, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన సయ్యద్ దావూద్‌అలీ, సయ్యద్ రిహానాబేగంలు దర్గాలో ముజావర్లుగా భక్తులకు సేవలందించేవారన్నారు. రోజువారి సేవలో భాగంగా 2014 ఏప్రిల్ 22వ తేదీన రాత్రి భార్యభర్తలైన సయ్యద్ దావూద్‌అలీ, సయ్యద్ రిహానాబేగంలు దర్గాలో భక్తుల సౌకర్యార్థమై ఏర్పాటు చేసిన షెడ్డులో నిద్రిస్తుండగా, గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోది అతికిరాతకంగా హతమార్చడం జరిగిందన్నారు. దర్గాలో జరిగిన దంపతుల హత్య విషయాన్ని తెలుసుకున్న అప్పటి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఎస్‌పి ఆర్.ప్రతాప్‌రెడ్డిలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, బాధితుల ఆందోళనతో నిందితులను పట్టుకునేందుకు ఉన్నతస్థాయి అధికారులతో విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం ఈ విషయమై గతంలో జిల్లా ఎస్పీగా పని చేసిన చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి బాధిత కుటుంబం, తాము అనేక పర్యాయాలు మొరపెట్టుకున్నా ఫలితంలేకుండాపోయిందన్నారు. దంపతుల హత్య జరిగి 15మాసాలు కావస్తున్నా, హంతకులను పట్టుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. అందువల్ల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తమరు(విశ్వప్రసాద్) ఈ కేసును సిబిసిఐడికి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరడం జరిగిందని ముఖీద్ ఫారూఖీ తెలిపారు.