నిజామాబాద్

పాఠశాలల్లో బయోమెట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, జూన్ 3: ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని మానిటరింగ్ చేసేందుకు ప్రతి జిల్లాలోని జిల్లాలో 25శాతం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు పద్దతిని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం బడిబాట కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులకు ఉన్న అపోహలను తొలగించి, ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసాన్ని నెకొల్పేందుకే జిల్లాలోని 25శాతం పాఠశాలలో బయోమెట్రిక్ హాజరు నమోదు ప్రక్రియను చేపట్టేందుకు కావాల్సిన నిధులు మంజూరీ చేయాలని కోరారు. జిల్లా సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం కింద వివిధ విద్యా అర్హతలు ఉన్న వారు వివిధ కేటగిరి పోస్టులలో నియమితులై ఉన్నారని, వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించకోలేకపోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 275ప్రభుత్వ పాఠశాలల్లో 20మందిలోపు విద్యార్థులు ఉన్నారని అన్నారు. బడిబాట కార్యక్రమాన్ని రెండు వారాల పాటు నిర్వహిస్తే బాగుటుందని, పిల్లల నమోదు శాతం మరింత పెరుగుతుందని సూచించారు. జిల్లాలో 120ఏకోపాధ్యా పాఠశాలలు ఉన్నాయని, సదరు ఉపాధ్యాయులు సెలవు పెడితే పాఠశాలలు మూతపడుతున్నాయని కలెక్టర్ డిప్యూటీ సిఎంకు వివరించారు. భవిత కేంద్రాలకు పంపేందుకు 400మంది పిల్లలను గుర్తించడం జరిగిందని, ఇందులో 21మంది అంధ, 50మంది మూగ పిల్లలకై ప్రత్యేక అవసరాల విద్యా కేంద్రాన్ని నిర్వహించేందుకు నిధులు మంజూరీకై ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 300గ్రామాలలో తమ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించాలని గ్రామసభలలో తీర్మానం చేసి పంపించడం జరిగిందని కలెక్టర్ డిప్యూటీ సిఎంకు వివరించారు. ఇందుకు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి స్పందిస్తూ, సర్వశిక్ష అభియాన్ నిధులతో బయోమెట్రిక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 12వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి పాఠశాలలో కనీసం 5శాతం పిల్లల నమోదు పెంచాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 28లక్షల మంది ఉన్న పిల్లల సంఖ్యను 30లక్షలకు చేర్చాలన్నారు. పిల్లల నమోదు పెంపునకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. ఇందులో గ్రామ సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, ఎంపిపిలు, జడ్పీటిసిలు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల భాగస్వామ్యాన్ని పొందాలని డిప్యూటీ సిఎం కలెక్టర్లతో పేర్కొన్నారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి వసతులు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ సంచాలకులు జి.కిషన్, ఎజెసి రాజారాం, డిఇఓ లింగయ్య పాల్గొన్నారు.