నిజామాబాద్

సొమ్మొకడిది.. సోకొకడిది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్నారెడ్డి, జూన్ 23: కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు పట్టెడు అన్నం పెట్టడం కోసం కిలో 33 రూపాయలకు బియ్యాన్ని కొనుగోలు చేసి, దాన్ని రాష్ట్రానికి కిలో 3 రూపాయలకు అందజేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 2రూపాయల సబ్సిడీ కల్పిస్తూ, ఒక్క రూపాయికే కిలో బియ్యం అందజేస్తున్నామని చెప్పుకుంటూ కేంద్ర పథకాన్ని హైజాక్ చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన భారత్ వికాస్ పర్వ్ (ప్రగతిపథంలో భారత దేశం) అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఉపాధిహామీ పథకం కింద ఉపాధి కల్పిస్తూ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీల అభ్యున్నతికి నిధులు కేంద్రం ఇస్తుందని, ఈపథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడా కూడా ఇవి కేంద్ర ప్రభుత్వ పథకాలని చెప్పడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం నిర్మాణాల కోసం రాష్ట్రానికి నిధులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఒక్కరి కైనా ఇళ్లు కట్టించారాఅని, నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేశారా అని ప్రశ్నించారు.ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, జిల్లా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, బిజెపి నియోజకవర్గ ఇన్‌చార్జి బాణాల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.