నిజామాబాద్

తూతూ మంత్రంగా విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, జూలై 1: ఆర్మూర్ పట్టణ నడిబొడ్డున హత్యకు గురైన తలారి సత్యం, చేపూర్ రవి కేసులో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణపై సిఐడి విచారణ తూతూ మంత్రంగా సాగుతోందని జెఎసి నాయకుడు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఆర్మూర్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో వినతిపత్రాల అనంతరం ఎస్సీ కమిషన్ స్పందించి విచారణకు ఆదేశించిందని, అయితే సిఐడి విచారణపై తమకు నమ్మకం లేదని, ఎమ్మెల్యేకు అనుకూలంగా నివేదికను తయారు చేస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. ఇంటర్‌పోల్ విచారణకైనా సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్వయంగా సిబిఐచే విచారణ చేయించుకొని తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సత్యం, రవిల హత్య సంఘటనలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రమేయం బయటపడుతుందన్న ఆలోచనతో కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్లు నిరూపణ అయితే ముఖ్యమంత్రికి చెడ్డపేరు వస్తుందని భావించి సిఐడి విచారణను తూతూ మంత్రంగా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకటి మాట్లాడుతూ ఆర్మూర్‌లో ఆరు నెలల క్రితం సత్యం, రవిల హత్య సంఘటనలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాత్రపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అనేక రూపాల్లో ఆందోళనలు చేశారని అన్నారు. ఈ ఆందోళనలో ఎక్కడా కూడా టిఆర్‌ఎస్ పాల్గొనలేదన్నారు. త్వరలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అన్ని పార్టీల ముఖ్యనేతలను కలుపుకొని ధర్నా చేస్తామని అన్నారు. ఈ నెల 13వ తేదిన ఆర్మూర్‌లో సత్యం, రవిల మృతిపై సంతాప సభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.