నిజామాబాద్

వర్ని, కోటగిరి మండలాలు నిజామాబాద్‌లోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటగిరి, జూలై 1: జిల్లాల పునర్ విభజనలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్ మండలాలు కామారెడ్డి జిల్లాలో కలుపుతుండగా, కోటగిరి, వర్ని మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కోటగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మండల మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, వర్ని, కోటగిరి మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా వర్ని మండలంలోని రుద్రూర్ మేజర్ గ్రామ పంచాయతీని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా, మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 2లక్షల పేద మైనార్టీలకు రంజాన్ పండుగ సందర్భంగా దుస్తులు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం తనయుడు సురేందర్‌రెడ్డి, ఎంపిపి సులోచన కిషన్, మైనార్టీ నాయకులు ఇక్బాల్, హమీద్, జిమ్మక్‌ఖాన్, నజీర్‌తో పాటు పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.