నిజామాబాద్

శ్రీరాంసాగర్‌లోకి స్వల్పంగా ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, జూలై 1: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి 2వేల క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలోని నిజామాబాద్, నాందేడ్, ఆదిలాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షం కారణంగా వరదనీరు వచ్చి చేరడంతో శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 1046.80అడుగులు 4.92టిఎంసిలకు చేరుకుందని ప్రాజెక్టు ఎఇ మోహన్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు 90టిఎంసిలు కాగా, గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1056.00అడుగులు 10.80టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే శుక్రవారం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర బాబ్లీ వద్ద నిర్మించిన ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు మరింత పెరిగే అవకాశం ఉందని ఎఇ తెలిపారు.