నిజామాబాద్

స్వచ్ఛ్భారత్ వైపు అడుగు ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, జూలై 1: స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిజామాబాద్‌ను సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా రూపొందించేందుకు చేపట్టిన చర్యలు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయ సంఘాలు, ఉద్యోగులు సమష్టిగా గ్రామ పంచాయతీలను యూనిట్లుగా తీసుకుని ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వాటి వినియోగం పట్ల కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరీ చేస్తున్న 12వేల విలువ చేసే యూనిట్‌తోనే నిర్ణీత కొలతలలో మరుగుదొడ్డి నిర్మాణంతో పాటు స్నానపు గదులను కూడా మంజూరీ చేయడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన కుటుంబాలు స్వచ్ఛ్భారత్ అమలులో భాగస్వాములవుతున్నాయి. మరుగుదొడ్ల వాడకం పట్ల ఆసక్తిని పెంచి, పరిశుభ్రంగా ఉంచుకునేందుకు బకెట్లు, ఫినాయిల్, బ్రెష్‌లను అందించేందుకు ప్రతి లబ్ధిదారుల నుండి 900రూపాయలను సేకరించి గ్రామజ్యోతి కమిటీల ఖాతాల్లో జమ చేశారు. అలాగే గ్రామాలు, ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఇంటింటికి మ్యాజిక్ సోక్ పీట్లు, చేతి పంపుల వద్ద కమ్యూనిటీ సోక్‌పీట్లను మంజూరీ చేయడం జరిగింది. దీంతో ఇండ్లలో వాడుకుని వదిలేసిన నీటిని ఇంకిపోయే విధంగా చేయడంతో పాటు ఇండ్లలో ఉన్న చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా డంపింగ్ యార్డులను చేపట్టడం జరిగింది. ఇండ్లలోని చెత్తను తొలగించేందుకు గాను గ్రామ పంచాయతీలకు రిక్షాలను కూడా అందజేస్తున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 80గ్రామ పంచాయతీలను బహిరంగ మలవిసర్జన రహిత ఓడిఎఫ్ గ్రామాలకు లక్ష్యంగా తీసుకుంటే, 65గ్రామ పంచాయతీలను ఇప్పటి వరకు ఓడిఎఫ్‌లుగా తీర్చిదిద్దారు. 2012లో నిర్వహించిన బెస్‌లైన్ సర్వేలో జిల్లాలో ఉన్న 4,01,823కుటుంబాలలో 83,917కుటుంబాలకు మరుగుదొడ్లు ఉన్నాయి. మరుగుదొడ్లు లేని కుటుంబాల సంఖ్య 3,17,906గా గుర్తించారు. వివిధ పథకాల కింద మంజూరీ చేసిన 1,46,032మరుగుదొడ్లలో ఇప్పటి వరకు 77,232పూర్తికాగా, మరో 55,292పురోగతిలో ఉన్నాయి. అందులో నిర్మల్ భాత్ అభియాన్ కింద మంజూరీ చేసిన 54,782లో మరుగుదొడ్లలో 39,320పూర్తయితే, 15,462పురోగతిలో ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరీ చేసిన 73,253లో 25,923పూర్తి కాగా, 36,622మరుగుదొడ్ల నిర్మాణాలు వివిధ దశలో కొనసాగుతున్నాయ.మరుగుదొడ్లు, స్నానపు గదులు, ఇంకుడు గుంతల నిర్మాణానికి మేస్ర్తిలకు శిక్షణ ఇప్పించడంతో పాటు వాటి ఆవశ్యకతను తెలియజేసేందుకు గాను కళాజాత బృందాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేయించడం ద్వారా స్వచ్ఛ భారత్ వైపు ప్రజలను మళ్లించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. వినూత్న పద్ధతిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గరిష్టస్థాయిలో వినియోగించేందుకు స్వచ్ఛ భారత్‌ను లక్ష్యంగా తీసుకున్న నిజామాబాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ జిల్లాగా గుర్తించింది. అందులో భాగంగానే ఛత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో జూలై 1, 2వ తేదీల్లో జరుగుతున్న స్వచ్ఛ భారత్ సదస్సుకు రాష్ట్రం తరఫున ప్రతినిధిగా ప్రభుత్వం కలెక్టర్ యోగితారాణాను పంపించారు.