నిజామాబాద్

ఇక కేజ్‌వీల్స్‌తో రోడ్డెక్కితే కేసులే... బాధ్యులపై క్రిమినల్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 2: ఇకపై కేజ్‌వీల్స్‌తోనే రోడ్ల మీద యథేచ్ఛగా రాకపోకలు సాగించే ట్రాక్టర్లకు సంబంధించి అధికారులు కఠిన చర్యలు చేపట్టనున్నారు. రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ బి.టి రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేయిస్తుండగా, కేజ్‌వీల్స్ కారణంగా అవి ధ్వంసమవుతూ అనతికాలానికే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితిని నిలువరించేందుకు ప్రభుత్వం కేజ్‌వీల్స్‌తో రోడ్లపై నడిచే ట్రాక్టర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో, సర్కారు ఆదేశాలను తుచ తప్పకుండా అమలు చేసేందుకు జిల్లా అధికారులు సన్నద్ధమయ్యారు. కేజ్‌వీల్స్‌తో రోడ్లపై ఎక్కడైనా ట్రాక్టర్లు నడిపిస్తే, సదరు వాహనాలను సీజ్ చేయడమే కాకుండా వాటి యజమానులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కేజ్‌వీల్స్ ట్రాక్టర్లు రోడ్డెక్కితే సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులను బాధ్యులుగా పరిగణించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆర్డీఓలు, తహశీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని జె.సి తెలిపారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారులు కేజ్‌వీల్స్ కారణంగా ధ్వంసమవుతూ ప్రజాధనానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లుతుండడంతో ప్రభుత్వం వీటి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. కేజ్‌వీల్స్‌తో నడిచే ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయమని, ఈ ప్రక్రియను స్వయంగా తానే క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తానని, ట్రాక్టర్ల స్వాధీనం, కేసుల నమోదు వివరాలను ఎప్పటికప్పుడు వివరాలు సేకరించడం జరుగుతుందని జె.సి పేర్కొన్నారు. నిజానికి కేజ్‌వీల్స్‌తో నడిచే ట్రాక్టర్లకు సంబంధించి ఇదివరకు కూడా అనేక కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేసే విషయంలో అధికారులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తూ వస్తున్నారు. దీంతో ప్రతీసారి ఖరీఫ్, రబీ సీజన్‌లలో రైతులు పొలాలను దమ్ము చేసేందుకు ట్రాక్టర్ల యజమానులను సంప్రదిస్తుండగా, వారు తమ వాహనాలకు కేజ్‌వీల్స్ భిగించుకుని వాటిని అలాగే తారు రోడ్లపై నుండి నడిపించుకుంటూ పంట పొలాలకు తీసుకెళ్తుండడంతో రోడ్లన్నీ చెడిపోతున్నాయి. అయినప్పటికీ రైతుల కోణంలో అధికారులు ఈ వ్యవహారం పట్ల చూసీచూడనట్టుగానే ఉండిపోతున్నారు. తొలిసారి కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్ పట్టుబడితే తక్కువ మోతాదులో అనంతరం మరో రెండుసార్లు పట్టుబడితే భారీ జరిమానాలు విధించడమే కాకుండా వాహనాన్ని జప్తు చేసి, కేసులు నమోదు చేయవచ్చు. కానీ ఈ దిశగా జిల్లాలో ఇంతవరకు ఏ ఒక్కరిపై కూడా కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఇదే అదనుగా పలువురు ట్రాక్టర్ల యజమానులు డ్రమ్ములు భిగించిన ట్రాక్టర్లనే రోడ్లపై నుండి యథేచ్ఛగా తింపుతున్నారు. కనీసం డ్రమ్ములకు తొడుగులు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా రోడ్లు చెడిపోకుండా ఉంటాయని అధికారులు అవగాహన కల్పించినప్పటికీ వాటిని కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభుత్వం కేజ్‌వీల్స్ ట్రాక్టర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వాటి పట్ల ఎక్కడికక్కడ నిఘాను కొనసాగించేందుకు జిల్లా అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిని సన్నద్ధం చేశారు. ఎక్కడైనా కేజ్‌వీల్ ట్రాక్టర్లు రోడ్డెక్కితే క్షేత్ర స్థాయి అధికారులు వీటి రాకపోకలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం ఖాయమని తెలుస్తోంది.

పార్టీలను పక్కన పెడితేనే బిసిల అభివృద్ధి
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
బోధన్, జూలై 2:అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న బిసిలు రాజకీయ పార్టీలను ప్రక్కన పెట్టి ఐక్యతగా ముందుకెళ్లినప్పుడే బిసిల అభివృద్ధి సాధ్యపడుతుందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బిసి కులాల వారు ఎన్నికల సమయంలో ఓటుహక్కును ఆయుధంగా మార్చుకుని బిసి వర్గానికి చెందిన వారిని గెలిపించి చట్ట సభలకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శనివారం బోధన్ పట్టణంలో బిసి చైతన్య సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజకీయ పార్టీలు బిసిల ఓట్లచే అధికారంలోనికి వస్తూ రూపాయి కిలోబియ్యం, పింఛన్‌లు అందిస్తూ మభ్యపెడుతున్నాయి కానీ బిసిల అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. మైనార్టీలు అడుగక ముందే వారి కోసం 70 గురకుల పాఠశాలలు మంజూరు చేసారని అలాగే వారికి 12 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. బిసిలు ఐక్యతగా లేకపోవడం వల్లనే పాలకులు బిసిలను విస్మరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బిసిలు ఇప్పటికైనా చైతన్యవంతులై పార్టీల కతీతంగా బిసి కులానికి చెందిన వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా గెలిపించి చట్టసభలకు పంపించాలని ఆయన సూచించారు. రాష్ట్ర శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చ జరిపేందుకు శాసనసభ్యులు ఏ మాత్రం ఆసక్తిని కనబర్చడం లేదన్నారు. కుంభకోణాల గురించి చర్చించేందుకు కేటాయిస్తున్న సమయాన్ని ప్రజా సమస్యల కోసం కేటాయిస్తే సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. బిసిలు ఐక్యతగా ఉంటే ప్రభుత్వం భయపడే అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని బిసిలు గుర్తుంచుకుని ఇప్పటికైనా చైతన్యులు కావాలన్నారు.
పాలకుల నిర్లక్ష్యంతోనే నిజాంసుగర్స్ మూసివేత
పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఎంతో చరిత్ర కలిగిన నిజాంచక్కెర కర్మాగారం మూతపడిందని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఇందులో అనేక మంది బిసి వర్గానికి చెందిన కార్మికులు శ్రమించి పనిచేస్తున్నారని కానీ కర్మాగారం మూతపడటం వలన కార్మికుల కుటుంబాలు రోడ్డు పాలు కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోనికి రాగానే ఈ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమని ఎన్నికల సమయంలో వాగ్ధానాలు చేసిన నాయకులు ఎన్నికల తర్వాత ఈ కర్మాగారం గురించి తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిజాంసుగర్స్ కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు ఇల్తెపు శంకర్, ఎంపిపి గంగాశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు గాండ్ల రవీందర్ యాదవ్, జనార్ధన్ చారి, సుధాకర్‌చారి, బీర్కూర్ శంకర్, హరికాంత్ చారి, అబ్బగోని గంగాధర్‌గౌడ్, తోకల గంగారెడ్డి, భరత్ యాదవ్, రామరాజు, నక్కలింగారెడ్డి, సూర లింగారెడ్డి, కొండయ్య, అల్లెరమేష్, రుద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బిసి సంఘం ఆధ్వర్యంలో ఆయా కులసంఘాల సభ్యులు పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి భారీ ర్యాలీ తీశారు.

మహా సరిహద్దులో భయం...్భయం...!
ఐసిఎస్‌కు మహారాష్టత్రో లింకులు
నాటి ఐఎస్‌ఐ మూలాలతో ప్రజలలో ఆందోళనలు
బోధన్, జూలై 2:హైదరాబాద్ నగరంలో భారీ పేళుళ్లకు కుట్ర పన్ని పోలీసుల చేతికి చిక్కిన ఐసిఎస్ సానుభూతి పరులకు నిధులు మహారాష్ట్ర నుండి వస్తున్నాయని ఎన్‌ఐఏ విచారణలో వెల్లడి కావడంతో సరిహద్దులో ఉన్న సమస్యాత్మక ప్రాంతాల ప్రజలలో ఆందోళన మొదలయ్యింది. మహారాష్టల్రో ఐసిఎస్ మూలాలు ఉన్నట్లయితే ఇక్కడ కూడా దాని ప్రభావం ఉండక తప్పదని ప్రజలు భావిస్తున్నారు. గతంలో ఇక్కడ వెలుగు చూసిన ఐఎస్‌ఐ కార్యకలాపాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఇక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నాడు సరిహద్దు ప్రాంతంలో ఐఎస్‌ఐ మూలాలు బయట పడటం, అందులో మహారాష్టక్రు చెందిన వారు పట్టుబడటంతో ప్రస్తుతం మహా సరిహద్దులో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురి కావాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ఈ ఏరియాలో ఎటువంటి కదలికలు లేకపోయినప్పటికీ ప్రక్కనే ఉన్న మహారాష్టల్రో ఉగ్రవాద మూలాలు ఉన్నాయని తెలుస్తుండటంతో ప్రజలలో కలవరం మొదలయ్యింది. దీనికి తోడు సరిహద్దులో నిఘా వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం, తనిఖీలు అంతంత మాత్రంగానే ఉండటం వలన పలు అనుమానాలకు తావిస్తోంది. మహారాష్టన్రు ఆనుకుని ఉన్న నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్‌లో గత పదిహేను సంవత్సరాల క్రితం రామక్రిష్ణారావ్ అనే సైకిల్ స్టోర్ యజమాని హత్యకు గురి కావడంతో పోలీసు విచారణలో ఇక్కడ ఐఎస్‌ఐ ఏజెంట్ ఆజంఘోరి తన కార్యకలాపాలు కొనసాగించారన్నది బహిర్గతమయ్యింది. అప్పటి జిల్లా ఎస్పీ రవిశంకర్ అయ్యన్నార్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం, ఆజంఘోరి పోలీసు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం వలన ఇక్కడి వ్యాపారి హత్య కేసు కొలిక్కివచ్చింది. ఈ హత్య కేసుతో పాటు విజయవాడలో జరిగిన మరో వ్యాపారి హత్య కేసులో మొత్తం పదమూడు మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఇందులో బోధన్ ఏరియాకు చెందిన వారితో పాటు ప్రక్కనే ఉన్నటువంటి మహారాష్టల్రోని బిలోలి, ధర్మాబాద్‌లకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరందరిపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇందులో కొందరు జైలు నుండి బయటకు రాగా మరికొందరు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ ఘటన తర్వాత కొన్నాళ్లు సరిహద్దులో నిఘా వ్యవస్థను ముమ్మరం చేశారు. జైలు నుండి విడుదలైన వారిపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. అయినా ఈ డివిజన్‌లోని మద్నూర్ మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న మహారాష్టల్రోని దెగ్లూర్‌లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు సంబంధించి ఆనవాళ్లు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. దేశంలో ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటుచేసుకున్నా అధికారులు ఈ సరిహద్దులో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించేవారు. కానీ కొన్నాళ్ల నుండి మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు కనిపించకుండా పోయాయి. డివిజన్‌లోని మద్నూర్, సాలూరా గ్రామాల వద్ద ఉమ్మడి తనిఖీ కేంద్రాలు ఉన్నప్పటికీ ఇక్కడ పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయలేక పోయారు. దాంతో అంతర్ రాష్ట్రాల నుండి ఎవ్వరు వస్తున్నారో, ఇక్కడి నుండి ఎవరు బయటకు వెళుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడి పోలీసులు అడపా, దడపా ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీలు చేస్తూ ఎంవియాక్టు కేసులు నమోదు చేస్తున్నారు. కానీ ప్రక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర నుండి వచ్చే వాహనాలు, కొత్త వ్యక్తుల పై ఎటువంటి దృష్టి సారించలేక పోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పట్టుబడిన ఐసిఎస్ సానుభూతి పరులకు మహారాష్ట్ర నుండి నిధులు వస్తున్నాయని వెల్లడి కావడంతో సరిహద్దు ప్రాంతాలలో నిఘాను మరింత పటిష్టవంతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గతంలో ఇక్కడ వెలుగు చూసిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని అధికారులు సరిహద్దు ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు చేసేందుకై ప్రత్యేక పోలీసు చెక్‌పోస్టులు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర, భైంస మండలాలు ఉండటం, బాసరలోని సరస్వతి అమ్మవార్ల దేవాలయంపై కూడా ఐసిఎస్ గురి పెట్టిందని ప్రచారం జరుగుతుండటంతో ఈ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలి
వినాయక్‌నగర్, జూలై 2: కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బార్ల రామారావు స్పష్టం చేశారు. శనివారం బార్‌అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట తన నిరసనలను కొనసాగించారు. వీరి నిరసన శిబిరాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.్భపతిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్, కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ రజినీకాంత్ తదితరులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎపి సిఎం చంద్రబాబునాయుడు తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయకుండా కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత కొద్ని రోజుల క్రితం తమ అధినేత కెసిఆర్ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా, రిలే నిరాహార దీక్షలు చేపడ్తామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న చంద్రబాబు, ప్రస్తుతం హైకోర్టు ఏర్పాటును అడ్డుకుంటున్నారని, అయినప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన టి.టిడిపి నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం సిగ్గుచేటన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసే వరకు టిఆర్‌ఎస్ పార్టీ న్యాయవాదులకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రాజేందర్‌రెడ్డి, సుదర్శన్, గణపతి, గంగొని శ్రీనివాస్, రెంజర్ల సురేష్, జగన్‌మోహన్‌గౌడ్, మధుసుదన్‌గౌడ్, రక్షిత్, ముఖేష్, స్వరూపారాణి, పద్మ, సవిత తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు జుడిషీయల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జుడిషీయల్ శనివారం ఫూలాంగ్‌లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన చాటారు. అనంతరం న్యాయవాదులు చేపట్టిన దీక్షా శిబిరానికి చేరుకున్న జుడిషీయల్ ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు.