నిజామాబాద్

హరితహారంపై ఎమ్మెల్యే షిండే ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్నూర్, జూలై 10: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై మండల, గ్రామస్థాయి అధికారులు అలసత్వం వహిస్తుండటంతో అసెంబీ ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదివారం మద్నూర్ మండలంలో స్థానిక పోలీసు శాఖ దత్తత తీసుకున్న పెద్దఎక్లారా గ్రామంలో ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం ప్రాముఖ్యతను ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ప్రజలకు వివరించారు. వాస్తవానికి ఈ గ్రామంలో 40వేల మొక్కలు నాటించాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ, క్లస్టర్, నోడల్ అధికారులు ఎవరు కూడా మొక్కలు నాటడం వల్ల ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించకపోయారు. దీంతో గ్రామంలో నిర్దేశించిన 40వేల మొక్కలకు గాను నిర్ణీత గడువులోగా కనీసం 20వేలు కూడా నాటించలేని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ఆదివారం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి మొక్కలు నాటడం వల్ల ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో గడిచిన రెండుమూడు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటానికి అడవుల శాతం గణనీయంగా తగ్గిపోవడమేనని, అడవులు, చెట్లు లేకపోవడం వల్ల ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నా వర్షం కురియలేదని ప్రజలకు వివరించారు. అదే విధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, తద్వారా అక్కడి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయని అన్నారు. ఇందుకు కారణంగా ఆ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాలు, గ్రామాల్లో, రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున చెట్లు ఉండటమేనని పేర్కొన్నారు. దీంతో దట్టమైన నల్లటి మబ్బులతో మేఘావృతమై అక్కడి చెట్లు వీచే గాలితో మేఘాలు ఆ ప్రాంతాలను తడిసి ముద్దచేస్తున్నాయని అన్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుండి గట్టేక్కేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే షిండే ప్రజలకు వివరించారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, స్మశాన వాటికలు, బీడు భూములు, అటవీ ప్రాంతం, రోడ్లకు ఇరువైపులా, రైతుల పంట భూముల్లో మొక్కలు నాటించేందుకు పటీష్టమైన ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నర్సరీల్లో మొక్కలను పెంచి నాటేందుకు సిద్ధంగా ఉంచామని, ప్రజలకు అవసరమైన మేర మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతులు తమ పంట పొలాల్లోని గెట్లపై టేకు, ఇతర పండ్ల మొక్కలను నాటితే ఒక్కో మొక్కకు 18రూపాయల వరకు చెల్లించడం జరుగుతుందని, వాటిని పరిరక్షించేందుకు ఒక్కో చెట్టుకు నెలకు 5రూపాయల వంతున ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందన్నారు. మద్నూర్ మండలం పెద్దఎక్లార గ్రామంలో 40వేల మొక్కలు లక్ష్యంగా నిర్దేశించగా, ఎమ్మెల్యే ఇంటింటి పర్యటనతో లక్ష మొక్కలు నాటేందుకు ప్రజలు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ముసురు కురుస్తున్నందున ప్రతి ఒక్కరు వెంటనే గుంతలు తీసుకోవాలని, రెండుమూడు రోజుల్లో అవసరమైన మొక్కలను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎల్లేశం, ఆర్‌ఐ నవీన్, ఎంపిడిఓ నాగరాజ్, ఎస్‌ఐలు కాశీనాథ్, సైదులు పాల్గొన్నారు.