నిజామాబాద్

ముగ్గురు ఇజిఎస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 25: పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం అమలులో అలసత్వాన్ని కనబరుస్తున్న అధికారులు, సిబ్బందిపై జిల్లా కలెక్టర్ యోగితారాణా కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే రెంజల్ మండలానికి చెందిన ఆరుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ, ఎడపల్లి మండలానికి చెందిన పలువురికి చార్జ్ మెమోలు జారీ చేసిన విషయం విదితమే. తాజాగా మొక్కల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగం మేరకు ఉపాధి హామీ పథకానికి చెందిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఒక టెక్నికల్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయించారు. నవీపేట మండలం బినోలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ రవితో పాటు మరో ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు వాటి చుట్టూ కంచెలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హామీ కూలీలను ఈ పనులకు మళ్లించాలని పదేపదే సూచిస్తున్నప్పటికీ పలుచోట్ల ఉపాధి హామీ సిబ్బంది పట్టించుకోకుండా నిస్తేజంగా వ్యవహరిస్తున్నారు. హరితహారం అమలు తీరును పరిశీలించేందుకు ఇటీవల డిఆర్‌డిఎ పి.డి పలు మండలాల్లో పర్యటించగా, ఉపాధి సిబ్బంది అలసత్వాన్ని గమనించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ, ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేయాలని కలెక్టర్ యోగితారాణా డ్వామా పి.డిని ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో నియోజకవర్గ స్థాయి ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మొక్కల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేయించబోమని హెచ్చరించారు. హరితహారం కింద మొక్కలు నాటడంలో వెనుకంజలో ఉన్న 13 మండలాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా 40వేల మొక్కలు నాటించని గ్రామ పంచాయతీలకు టేకు స్టంపులను సరఫరా చేయనున్నామని చెప్పారు. ప్రధానంగా బాల్కొండ, భిక్కనూరు, దోమకొండ, జుక్కల్లింగంపేట, మద్నూర్, రెంజల్, మాక్లూర్, నాగిరెడ్డిపేట, నందిపేట, నవీపేట, సిరికొండ, ఎడపల్లి మండలాలు హరితహారంలో వెనుకబడి ఉన్నాయన్నారు. ఈ నెల 26న సంబంధిత మండల కేంద్రాల్లో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, సెక్టార్ అధికారులతో సమావేశాలు నిర్వహించి లక్ష్యాల సాధనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం రోజున జిల్లాకు లక్ష వరకు టేకు స్టంపులు వస్తున్నాయని, వాటిని అవసరమైన ప్రాంతాలకు కేటాయించేలా చూడాలన్నారు. మండల వ్యవసాయధికారులతో చర్చించి రైతుల వారీగా టేకు స్టంపులను పంపిణీ చేయాలన్నారు. ఇళ్లలో నాటేందుకు పండ్ల మొక్కలను అందించాలని సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు నియమించిన ఉపాధి హామీ జాబ్‌కార్డు హోల్డర్ల వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క మొక్క కూడా ఎండిపోకుండా, పశువులకు మేతగా మారకుండా వాటి చుట్టూ కంచెలను ఏర్పాటు చేయించాలని సూచించారు. జిల్లాలో వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలలో 74శాతం మొక్కలు నాటితే, అటవీ శాఖ ద్వారా మాత్రం కేవలం 53శాతం వరకే మొక్కలు నాటారని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ శాఖకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మొత్తం 75లక్షల మొక్కలు నాటాలని ఆదేశించారు. హరితహారం అమలును పరిశీలించేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శాంతికుమారని జిల్లాను సందర్శించనున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటిన ఈత, ఖర్జూర, గిరకతాటి మొక్కలను పరిశీలించనున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జె.సి రవీందర్‌రెడ్డి, అదనపు జె.సి రాజారాం, డ్వామా పి.డి వెంకటేశ్వర్లు, డిఇఓ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.