నిజామాబాద్

265 మంది పుష్కర స్నానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఆగస్టు 2: గోదావరి అంత్య పుష్కరాల్లో భాగంగా మోర్తాడ్ మండలం తడ్‌పాకల్ పుష్కర ఘాట్‌లో 3వ రోజు 265మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఒకవైపు చిరుజల్లులు కురుస్తుండటంతో పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతోంది. గోదావరిలో వరద ప్రవాహం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పుష్కర ఘాట్‌లో ఐదుగురు గజ ఈతగాళ్లను మత్స్య పారిశ్రామిక శాఖ నియమించింది.
గోదావరిలో పుష్కర స్నానాలు చేసిన భక్తులు చిరుజల్లులు కురుస్తున్న నేపథ్యంలో పిండ ప్రదాన కార్యక్రమాలను తీరంలోని శ్రాద్ధ మంటపంలో నిర్వహించుకున్నారు. దోంచంద, గుమ్మిర్యాల పుష్కర ఘాట్లలో పదుల సంఖ్యలోనే భక్తులు పుష్కర స్నానాలు చేశారు. దేవాదాయ శాఖ అధికారులు మూడు పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.