నిజామాబాద్

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఆగస్టు 2: మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట వద్ద పెద్దవాగు నిండుగా ప్రవహిస్తోంది. రెండు రోజుల క్రితం వరకు కేవలం మొండివాగు జలాలు మాత్రమే పెద్దవాగులోకి మళ్లగా, రామన్నపేట ఉడిపివాగు మిగులు జలాలు కూడా పెద్దవాగులోకి మళ్లాయి. భీమ్‌గల్ కప్పలవాగు, వేల్పూర్ మోతె వాగు కూడా ప్రవహిస్తుండటంతో ఆ జలాలన్నీ పెద్దవాగులోకి మళ్లాయి. గాండ్లపేట వద్ద పెద్దవాగులో వరద ప్రవాహం పెరిగింది. పెద్దవాగుపై నిర్మించిన పాత వంతెన కింద ఫిర్లర్లను పరీక్షేందుకై ఏర్పాటు చేసిన ఫుట్‌లెవల్ బ్రిడ్జి పైనుండి రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఒక్కసారిగా పెద్దవాగులో వరద ప్రవాహం పెరగడంతో చాలామంది రైతులు వాగులో ఏర్పాటు చేసుకున్న మోటార్లను తొలగించారు. వరద ఉద్ధృతికి మోటార్లు కొట్టుకుపోయే అవకాశం ఉంటుందని, అందువల్లే వాటిని తొలగిస్తున్నట్లు మోర్తాడ్‌కు చెందిన రైతు సామ శ్రీనివాస్ అన్నారు. వాగు నిండుగా ప్రవహిస్తుండటంతో అడుగంటిన భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు ముమ్మరంగా సాగిన ఇసుక రవాణాతో ఏర్పడిన గుంతల్లో కూడా ఇసు మేటలు పెడుతున్నాయి. మంగళవారం కూడా భీమ్‌గల్, మోర్తాడ్, వేల్పూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో పెద్దవాగులో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం ఒడ్యాట్, కమ్మర్‌పల్లి, ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో ఈ జలాలన్నీ మొండివాగు మత్తడిలోకి మళ్లుతున్నాయి.