నిజామాబాద్

అంధులకు టచ్ అండ్ స్మెల్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 16: అంధుల కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్‌లో టచ్ అండ్ స్మెల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం కలెక్టర్ యోగితారాణా, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, మేయర్ ఆకుల సుజాతలతో కలిసి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యోగితారాణా టచ్ అండ్ స్మెల్ పార్క్ విశేషాలను వివరించారు. ఈ పార్కు ద్వారా నిజామాబాద్ నగరానికి మరింత విశిష్టత చేకూరనుంది. ఇప్పటివరకు కేవలం నార్వే దేశంలో మాత్రమే టచ్ అండ్ స్మెల్ పార్కు ఉండగా, అదే తరహాలో ప్రపంచంలోనే రెండవ పార్కును నిజామాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. సుమారు 58లక్షల రూపాయల అంచనా వ్యయంతో దీనిని నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే కలెక్టర్ యోగితారాణా ఆదేశాల మేరకు అధికారులు నార్వే దేశానికి వెళ్లి అక్కడి టచ్ అండ్ పార్క్‌ను పరిశీలించి వచ్చారు. అదే తరహాలో అంధుల కోసం ప్రత్యేకంగా నిజామాబాద్‌లోనూ ఉద్యానవనం నెలకొల్పేలా చర్యలు చేపడుతున్నారు. చూపు లేకపోయినప్పటికీ అంధులు ఈ ఉద్యానవనంలో ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటు చేసే కళాకృతులను తాకడం ద్వారా వాటి గురించి పూర్తిగా తెలుసుకుని చక్కటి అనుభూతిని పొందేలా టచ్ అండ్ స్మెల్ పార్కును నెలకొల్పనున్నారు. ఈ పార్కులో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ప్రపంచంలోని ఏడు వింతలైన తాజ్‌మహల్, చైనా గ్రేట్ వాల్, ఈఫిల్ టవర్, రోమ్ నగరంలోని కొలీజియం, ఇటలీలోని పిసా టవర్లు, ఈజిప్టులోని పిరమిడ్‌లు, బ్రెజిల్‌లోని క్రీస్తు శిల్పం, భారతదేశ చారిత్రక సంపదగా పరిగణించే ఇండియా గేట్, పార్లమెంటు, జంతర్‌మంతర్, ఎర్రకోట, కుతుబ్‌మినార్, తెలంగాణలోని చార్‌మినార్, అసెంబ్లీ, క్లాక్‌టవర్, తంగెడు పువ్వు, కృష్ణజింక, పాలపిట్ల, జమ్మిచెట్టుతో పాటు రైనోసారస్, డైనోసార్, జిరాఫీ, ఏనుగు, పులి, చిలుక, సింహం, కుక్క, ఒంటె, ఎద్దు, పాము, రవాణా సాధనాలైన విమానం, బస్సు, రైలు, ఆటోరిక్షా, కార్, మోటార్ సైకిల్, సైకిలు వంటి మొత్తం 38రకాల వస్తువులను ప్రత్యేకంగా రూపొందించి టచ్ అండ్ స్మెల్ పార్కులో అందుబాటులో ఉంచాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. వీటిని ఫైబర్‌తో నిర్మింపజేసి నాలుగు అడుగుల విస్తీర్ణం చొప్పున ఏర్పాటు చేయనున్నారు. అంధులు వీటిని చేతితో తాకి స్పర్శ ద్వారా వివిధ ఆకృతుల నమూనాలు, జంతువులు, పక్షులను గుర్తించి అనుభూతి పొందేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే దీని నిర్మాణానికి సంబంధించి తిలక్ గార్డెన్‌లో స్థలాన్ని గుర్తించడంతో పాటు ప్లాన్‌ను సిద్ధం చేయించామని కలెక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. ఈ పార్కులో అంధులు, అంధ విద్యార్థులకు ఎలాంటి రుసుము లేకుండానే ఉచిత ప్రవేశం కల్పించనుండగా, సాధారణ విద్యార్థులు, పిల్లలకు నామమాత్రపు రుసుము వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. మొత్తం మీద అంధుల కోసం ప్రత్యేకంగా నార్వే తరువాత ప్రపంచంలోనే రెండవ ఉద్యానవనంగా నిజామాబాద్ నగరంలో టచ్ అండ్ స్మెల్ పార్కు ఏర్పాటు కానుండడం విశేషం.
జిల్లా కేంద్రంలో రిసోర్స్ సెంటర్ ఏర్పాటు
కాగా, అంధ విద్యార్థులకు మరింత తోడ్పాటును అందిస్తూ, వారి అభ్యున్నతికి దోహదపడేందుకు వీలుగా జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా రిసోర్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ యోగితారాణా తెలిపారు. లిడ్‌క్యాప్ భవనంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పుతామని అన్నారు. సుమారు 500మంది అంధులు, అంధ విద్యార్థులను ఈ కేంద్రంలో వసతి కల్పిస్తూ, వారి విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కేంద్రంలో ప్రత్యేకంగా ఆడియో రికార్డింగ్ సదుపాయంతో పాటు బ్రెయిలీ లిపిలో ప్రింటింగ్ సామాగ్రి, లైబ్రరీ, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన కంప్యూటర్ ట్రైనింగ్‌ను అందించనున్నామని, ఈ కేంద్రం పూర్తిగా తన పర్యవేక్షణలోనే కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. నిజామాబాద్‌తో పాటు ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన వారిని కూడా ఈ కేంద్రంలో చేర్పించవచ్చని అన్నారు. పూర్వ ప్రాథమిక విద్య నుండి మొదలుకుని ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జిల్లా యంత్రాంగంతో పాటు జిల్లా అంధత్వ నివారణ సంస్థ, స్నేహా సొసైటీల ఆధ్వర్యంలో ఈ రిసోర్స్ సెంటర్‌ను నిర్వహిస్తామని తెలిపారు. మైనార్టీ