నిజామాబాద్

కెసిఆర్ అసమర్థత వల్లే విద్యారంగం నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఆగస్టు 17: ముఖ్యమంత్రి కెసిఆర్ అసమర్థత వల్లే తెలంగాణలో విద్యారంగం నిర్వీర్యంగా మారుతోందని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు ఆరోపించారు. బుధవారం నగరంలోని పాత అంబేద్కర్ భవన్‌లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఎఐఎస్‌ఎఫ్) 81వ ఆవిర్భావ ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నా, పాలకులు నామమాత్రంగానైనా స్పందించడం లేదన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటినా, విద్యారంగ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు కెజి నుండి పిజి వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, దానిని అటకెక్కించారని అన్నారు. ఎంసెట్ లీకేజీకి బాధ్యులైన విద్య, వైద్య శాఖల మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, ఎంసెట్ కన్వీనర్‌లను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని ప్రగల్భాలు పలికిన కెసిఆర్ ప్రభుత్వం, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న మెస్ బిల్లులు, ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. యూనివర్శిటీల అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కెసిఆర్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో విద్యా రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతోందని ఆయన ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ నాయకులు ఉమామహేష్, కంజర కిరణ్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.