నిజామాబాద్

దళితలకు మూడెకరాల భూమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, ఆగస్టు 19: తెలంగాణ ప్రభుత్వం నిరుపేద దళితులకు మూడెకరాల భూమిని పంపిణి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడ్తుందని, జిల్లా జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంసాగర్ మండలంలోని సింగీతం, రంగాపూర్, షర్‌కాన్ పల్లి, గున్కుల్, మల్లూర్ గ్రామ శివారులోగల పట్ట్భాములను జెసితోపాటు బోధన్ ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి పరిశీలించారు. గున్కుల్ గ్రామ శివారులోపట్ట్భాములను పరిశీలించిన అనంతరం జెసి ఆర్డీను, దళితులు కలిశారు. గున్కుల్ గ్రామశివారులోమొదటి విడతగా 8మంది దళితులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం 3 ఎకరాల భూమిని పంపిణి చేసిందని, భూమి సాగు చేసుకునేందుకు బోరు మోటర్ మంజూరు చేయాలని దళితులు జేసిని కోరారు. ఈవిషయమై స్పందించిన జెసి లబ్దిదారులకు ఎస్సీకార్పొరేషన్ ద్వారా బోరు మోటర్ మంజూరైయ్యేలా కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ, గ్రామాలలోని అత్యంత నిరుపేద దళితులకు గుర్తించి, 3ఎకరాల భూమి వారి పేరిట పట్టాచేయిస్తామన్నారు. గ్రామాలలోని భూమిని రైతుల వద్ద కొనుగోలు చేసుకుని, దళితులకు అందజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న భూమి సాగుకు యోగ్యమైనటువంటి భూమిని దళితులకు పంపిణి చేసి వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తుందన్నారు. జెసి వెంట తహశీల్దార్ ఎండి. అబ్దుల్ ఘనీ ఖాన్, డిటి సయిద్ అహ్మద్ మస్రూర్, విఆర్‌ఓలు పండరి, జబ్బార్ ఖాన్, మారుతి, నాయకులు దఫేదార్ విజయ్‌కుమార్, వాజిద్, కాశయ్య, మహేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.