నిజామాబాద్

‘మహా’ ఒప్పందంపై.. అటు సంబురాలు..ఇటు నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 23: గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ వద్ద నిర్మించదల్చిన కాళేశ్వరం సహా ఇతర బ్యారేజీలకు సంబంధించి మహారాష్టత్రో ఒప్పందం ఖరారవడంతో నిజామాబాద్ జిల్లా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ తెరాస శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో గులాబీ శ్రేణులు పాల్గొని కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆయా మండలాల్లో బాణాసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుకున్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ‘మహా’ ఒప్పందం ద్వారా తెలంగాణకు శాశ్వత ద్రోహం జరిగేలా వ్యవహరించారని ఆక్షేపిస్తూ కాంగ్రెస్ నాయకులు నిరసన వెలిబుచ్చారు. డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ నేతృత్వంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఇతర కాంగ్రెస్ నాయకులు నల్ల జెండాలతో ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని ఇంచార్జ్ అదనపు జె.సి మోహన్‌లాల్‌కు మెమోరాండం అందజేశారు. అధికార, ప్రతిపక్షాల తీరు ఎలా ఉన్నప్పటికీ, ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో తెరాస ప్రభుత్వం చెబుతున్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నిజామాబాద్ జిల్లాకు ఇతోధికంగా ప్రయోజనం చేకూరుతుందని ఈ ప్రాంత రైతులు ఆశిస్తున్నారు. కాళేశ్వరం ద్వారా 18.19లక్షల ఎకరాలకు సాగునీరందడమే కాకుండా, నిజాంసాగర్, సింగూర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా మరో 18లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుందని పేర్కొంటోంది.