నిజామాబాద్

విమోచన దినంపై తెరాస ద్వంద్వవైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, సెప్టెంబర్ 8: తెలంగాణ విమోచన దినంపై అధికార తెరాస పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆనాడు ప్రభుత్వాలను నిలదీసిన తెరాస, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని విస్మరిస్తూ బిజెపిని తప్పుబడుతోందని విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో చేపట్టిన తిరంగా యాత్రను గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సెగ్మెంట్ పరిధిలోని వందలాది మంది కార్యకర్తలు అన్ని మండలాల గుండా మోటార్ సైకిల్ ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా ఏర్గట్లలో ముగింపు కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏనాటి నుండో ఎదురుచూసిన ప్రజలకు ఆ కల నెరవేరినప్పటికీ, తెలంగాణ విమోచన దినంపై మాత్రం స్పష్టత కరువైందని అన్నారు. మిగతా రాష్ట్రాలు విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటే, తెలంగాణలో మాత్రం తెరాస ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కేవలం ఒక పార్టీకి భయపడే తెరాస ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని ఆయన ఆక్షేపించారు. పైగా తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో బిజెపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షను గుర్తిస్తూ సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఆధ్వర్యంలో బూత్ కమిటీ మొదలుకుని అన్ని స్థాయిలలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ ఆర్.రాజేశ్వర్, నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి, ముత్యాల మనోహర్‌రెడ్డి, కోటపాటి నర్సింహనాయుడు, శ్రీనివాస్, నారాయణరెడ్డి, రమేష్‌రెడ్డి, బోగ దేవేందర్‌తో పాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.