నిజామాబాద్

గురువుల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, సెప్టెంబర్ 8:విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర చాలా కీలకమని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాదికారి ఒడ్డెన్న అన్నారు. గురువారం బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దేందుకు అద్యాపకులు కృషి చేస్తారని విద్యార్థులు గురువులు చెప్పిన అన్ని విషయాలను పరిగణనలోనికి తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అద్యాపకులు పలు సందర్భాలలో విద్యార్థులను మందలించడం కూడా జరుగుతుందని ఇటువంటి వాటికి విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆయన హితవు పలికారు. తప్పు చేసినప్పుడే అద్యాపకులు మందలిస్తారనే వాస్తవాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో రాణించగలుగు తారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల కోసం నేడు ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తోందని ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కళాశాల ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్ అక్బరి బేగం, కళాశాల అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.