నిజామాబాద్

పాలనా సౌలభ్యం కోసమే నూతన మండలాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, అక్టోబర్ 6: పాలన సౌలభ్యం కోసమే ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. గురువారం ఆయన నూతన మండలంగా ఏర్పాటు కానున్న రాజంపేట గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ కార్యాలయం అధికారులు సూచించిన ప్రకారం బిసి కాలనీలో ఉన్న పాఠశాలలో కాకుండా వందమీటర్ల దూరంలో ఉన్న ప్రైవెట్ బిల్డింగ్‌కు మార్చాలని సూచించారు. ఇందుకు 5వేల రూపాయల చొప్పున నెల కిరాయి ఉంటుందని ఇంటి యాజమాని కోరగా గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లక్ష 25వేల రూపాయలు చెల్లించాలని సూచించారు. దీనికి గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. దీంట్లో నుండి 15వేల రూపాయలను అడ్వాన్సుగా ఇంటి యాజమానికి ప్రభుత్వ విప్ సమక్షంలో అందచేశారు. అంతేకాకుండా వ్యవసాయశాఖ కార్యాలయాల ఏర్పాటుకు రాజంపేట డాక్టర్ సిద్దిరాములు తన భవనాన్ని ఇవ్వడం పట్ల ప్రభుత్వ విప్ అభినందించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలోని పాత భవనంలో తహశీల్దార్ కార్యాలయం, బిసి పాఠశాలలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తులు మండలం కోసం ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆయన వెంట భిక్కనూరు, తాడ్వాయి మండలాల టిఆర్‌ఎస్ అధ్యక్షులు జుకంటి మోహన్‌రెడ్డి, గడ్డం రాంరెడ్డి, నాయకులు నీరడి శంకర్, లింగాల కృష్ణ, సురేందర్, కమాలకర్‌రావు, భాస్కర్‌రెడ్డి, దుర్గారెడ్డి, తహశీల్దార్ అంజయ్య, ఎంపిడిఓ గోపాల్‌రావులున్నారు.