నిజామాబాద్

రాజు కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 17: హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న రాజు కుటుంభానికి ప్రభుత్వం పదిలక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేయాల్సిందిగా ఎల్లారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాలుతుమ్మెద గ్రామానికి వెళ్లి మృతుడు రాజు కుటుంభాన్ని పరామార్షించి, మృతుని భార్య సంద్యారాణికి తనవంతుగా 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు. అనంతరము మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరులసమావేశంలో మాట్లాడుతూ, బాదిత కుటుంభానికి పదిలక్షల రూపాయలతో పాటు ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, వారిపిల్లలకు ఉన్నత చదువులు చదివించే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాల విభజన ప్రక్రియ శాస్ర్తియ పద్దతిలో జరగలేదని ఆరోపించారు. మెదక్ జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలాన్ని విలీనం చేయలేదన్న మానస్థాపంతోనే రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. రాజుది ఆత్మహత్య కాదని టిఆర్‌ఎస్ సర్కార్ హత్యగా ఆరోపించారు. ఈ సంఘటనను తమ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకుని పోయినట్లు చెప్పారు. టిఆర్‌ఎస్ సర్కార్ పోలీసులతో ప్రజల గొంతు నొక్కిస్తుందని ఆరోపించారు. మృతి చెందిన రాజు కుటుంభాన్ని పరామార్షించేందుకు ఆదివారం తాను మాలుతుమ్మెద గ్రామానికి వెళితే తనపై పోలీసులు దాడి చేసి, ఈడ్చుకుంటూ మెదక్ తరిలించారని అన్నారు. తాను ఏ తప్పు చేయకున్న తనపై పోలీసులు ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారని ప్రశ్నించారు. దగ్గర్లోనే గల కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట్ పోలీస్‌స్టేషన్‌కు తరిలించుకుండా తనను మెదక్ పోలీస్‌స్టేషన్ తరిలించాల్సిన అవసరం ఎం వచ్చిందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ప్రతాప్‌రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింలు, నాగిరెడ్డిపేట్ సర్పంచ్ విఠల్‌రెడ్డి, ఆత్మకుర్ ఎంపిటిసి మనోహర్‌రెడ్డి, నాయకులు వాసురెడ్డి, భూపాల్‌రెడ్డి, ఫారుక్, మల్లేశం తదితరులు ఉన్నారు.
మండల కేంద్రంలో నాగిరెడ్డిపేట్ మండలాన్ని మెదక్ జిల్లాల కలాపాలంటూ ఉద్యమిస్తున్న సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో బంద్ పాటించారు. నాగిరెడ్డిపేట్ మండలాన్ని మెదక్ జిల్లాలో విలీనం చేయకపోవడంతో మానస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రాజు ఆత్మకు శాంతిచేకూరాలని, అలాగే అయన అంత్యక్రియలకు అఖిలపక్ష నేతలు పాల్గొనకుండా పోలీసుల అరెస్ట్‌లు, గృహనిర్భందాలను నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు.