నిజామాబాద్

నిజాంసుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, నవంబర్ 20:బోధన్ నిజాంచక్కెర కర్మాగారాన్ని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం నాడిక్కడ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఈ ఫ్యాక్టరీ స్వాధీనం విషయమై ముఖ్యమంత్రి కెసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఎటువంటి చర్యలు చేపట్టలేక పోయారని ఆయన విమర్శించారు. గత తెలుగుదేశం హాయంలో ప్రైవేటీకరణ జరుగడంతో కాంగ్రెస్ సర్కారు సభాసంఘాన్ని వేసిందని, ఈ సభాసంఘం సిఫార్సులు అమలు చేయాలని బిజెపి గతంలో అనేక సందర్భాలలో శాసనసభలో అప్పటి ప్రభుత్వాన్ని కోరిందని అన్నారు. తెలంగాణ ఆస్థిగా చెప్పుకోబడే నిజాంచక్కెర కర్మాగారాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఎన్నికల సమయంలో ఈ కర్మాగారాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకున్న తెరాస నేడు వీటిని విస్మరించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. నిజాంసుగర్స్ కర్మాగారం మూతపడటం వలన ప్రస్తుతం కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందన్నారు. పది నెలలుగా కార్మికులకు వేతనాలు కరువయ్యాయని అలాగే చెరకు రైతులు పంట సాగుకు దూరమయ్యారని ఆయన వివరించారు. రైతులు చెరకు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ కర్మాగారం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడం శోచనీయమన్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం నిజాంచక్కెర కర్మాగారాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపిస్తే ఈ ఏరియాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. అలాగే ఈ ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బోధన్ సీనియర్ నాయకుడు డాక్టర్ శివప్ప, పట్టణాధ్యక్షుడు ఉమాశంకర్, కౌన్సిలర్లు రామరాజు, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.