నిజామాబాద్

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్నూర్, డిసెంబర్ 13: మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పంపిణీ చేశారు. మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మద్నూర్, పిట్లం, నిజాంసాగర్, జుక్కల్ మండలాలకు చెందిన 205మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరై చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆడపిల్లలు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ పథకాల ద్వారా పెళ్లి కుమార్తెల తల్లి పేరిట 51వేల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందజేస్తున్నామని అన్నారు. ఈ పథకాలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను అమలు చేస్తూ, దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా కెసిఆర్ కొనసాగుతున్నారని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ సాయాగౌడ్‌తో పాటు నాలుగు మండలాల జడ్పీటిసిలు, ఎంపిపిలు, ఎంపిడిఓలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కంఠేశ్వర్, డిసెంబర్ 13: నగరంలోని పలు డివిజన్లలో సిసిడ్రైనేజీ పనులకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మంగళవారం శంకుస్థాపనలు చేశారు. 24వ డివిజన్ పరిధిలోని గాజుల్‌పేట్‌లో 10లక్షల జనరల్ ఫండ్‌తో సిసి డ్రైనేజీ పనులకు, 35వ డివిజన్‌లోని ఖిల్లా ప్రాంతంలో 15లక్షలతో సిసిడ్రైనేజీ, 34వ డివిజన్‌లోని ఖిల్లా ప్రాంతంలోని మున్నూరుకాపు సంఘం ఎదుట 15లక్షలతో, 45వ డివిజన్‌లోని సుభాష్‌నగర్ వాటర్‌ట్యాంక్ వద్ద 15లక్షలతో సిసి డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. నగరాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్ ఫహీం, కమిషనర్ నాగేశ్వర్, ఎఇలు, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.