నిజామాబాద్

సిద్దిరామేశ్వరుడ్ని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, డిసెంబర్ 18: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు రాపోల్ ఆనంద్‌భాస్కర్ భిక్కనూరు సిద్దిరామేశ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైవ దర్శనానికి వచ్చిన రాజ్యసభ సభ్యుడికి పూర్ణకుంభ హారతితో వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సిద్దిరామశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన మండపంలో ఆనంద్‌భాస్కర్‌కు తీర్థ ప్రసాద వితరణ చేశారు. అనంతరం ఆయనకు ఆలయ ఫొటో బహూకరించి శాలువ కప్పి సత్కారించారు. ఆలయ ఇఓ శ్రీధర్, పౌండరీ ట్రస్టు చైర్మన్ ప్రభు లింగప్పలు ఆలయ అభివృధ్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్ది చంద్రకాంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్ చిన్నమల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకట్‌రాజ్యం, సుదర్శన్, లింబాద్రి, దయాకర్‌రెడ్డి, సిద్దిరాములు, తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట
రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

డిచ్‌పల్లి రూరల్, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని నిజామాబాద్ రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. డిచ్‌పల్లి మండలం బీబీపూర్ తండాలో 18లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, 18లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణం, డిచ్‌పల్లిలో 18లక్షల రూపాయల వ్యయంతో అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్సీ విజి.గౌడ్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బీబీపూర్ తండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ, రూరల్ నియోజకవర్గంలో 118గిరిజన తండాలు ఉన్నాయని, అందువల్ల జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేనన్ని నిధులను ప్రభుత్వం రూరల్‌కు కేటాయించడం జరిగిందన్నారు. ఈ నిధులతో తండాల్లో కనీస వౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదే విధంగా గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆకాంక్షించారు. టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో 500పైచిలుకు జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. గిరిజన విద్యార్థుల సౌకర్యార్థమై కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీబీపూర్‌తండా సర్పంచ్ సుందర్, మండల అధ్యక్షుడు కృష్ణ, ఒడ్డె నర్సయ్య, పద్మారావు, కంచెట్టి గంగాధర్, చింతల గోపి, శ్యామ్‌రావు, లక్ష్మినారాయణ తదితరులు ఉన్నారు.