అమృత వర్షిణి

గీతూర్న్ టౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనిస్ ఆఫ్ ది నార్త్ అని ముద్దు పేరున్న గీతూర్న్‌లో మనకి ఎక్కడికక్కడ అందమైన కెనాల్స్ కనిపిస్తాయి. 1230లో ఈ ప్రాంతాన్ని గుర్తించారు. ఇది సహజసిద్ధమైన అందాలతో అలరారుతూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని కనిపెట్టిన సమయంలోనే మేకల అరుపులు వినిపించాయట. అందుకే దీనికి గీతూర్న్ అని పేరు పెట్టారు. అంటే మేక అరుపు అని అర్ధం. ఇక్కడ మనకు కార్లు కనిపించవు. స్థానికులు తమ అవసరాల నిమిత్తం బయటికి వెళ్లాలంటే నగరం అంతా వ్యాపించి ఉన్న కెనాల్స్‌లో పడవల గుండా ప్రయాణిస్తారు. ఈ దృశ్యం చూడడానికి అబ్బురంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ ప్రాంతం చలికాలంలో మరింత అందంగా మారిపోతుంది. ఎలాగంటే ఇక్కడున్న తటాకాలన్నీ గడ్డ కట్టి, అద్దంలా మెరిసిపోతుంటే, స్థానికులు, టూరిస్టులు హాయిగా ఐస్‌స్కేట్ చేసి ఎంజాయ్ చేస్తారు.