Others

రంగుల పండుగలో భక్తితత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భ గవంతునికి రూపం లేదు. నామంలేదు. కాని ఎవరి ఇచ్ఛ వచ్చినట్లు వారికి భగవంతుడు కనిపిస్తాడు. వారికి కోరుకున్న రూపంలోను వారు కోరుకున్న నామంలో దర్శనమిచ్చి వారికి ఆనం దాన్ని ఇస్తాడు. ఫాల్గుణమాసపు పున్నమిరోజు మీనాక్షిదేవి ఎంతోకాలం తపస్సు చేసి సుందరేశ్వ రుణ్ణి తన భర్తగా చేసుకొందట. అందుకని ఈ పున్నమిరోజు మీనాక్షి సుందరేశ్వరుల వివాహ మహోత్సవాన్ని శివభక్తులు జరుపుతారు. మీనాక్షి దేవాలయంలోను ప్రత్యేక కల్యాణోత్సవాలు, ప్రత్యేక పూజలు విశేషఅర్చనలు చేస్తుంటారు.
కృష్ణ్భక్తులు కృష్ణుని మనసారా కోరుకున్న మానసచోరుడని కీర్తిస్తూ ఆయన్ను వూయల్లో కూర్చోబెట్టి వూయలను వూపుతుంటారు. మరికొందరు బాలకృష్ణుని స్మరించి యశోదమ్మ వూయలల్లో బాలకృష్ణయ్యను పరుండబెట్టిందని నమ్ముతూ వారు కూడా కృష్ణవిగ్రహాన్ని వూయల్లో పడుకోబెట్టి వూపుతారు. ఇలా కృష్ణ్భక్తులు ఫాల్గుణ పున్నమిరోజున కృష్ణనామంతో పండుగ చేసుకొంటారు.
ఒకసమయంలో తారకాసురుడను అసురుడు దేవతలను మునులను సజ్జనులను హింసించే వాడు. అతని బాధలు తట్టుకోలేక అందరూ బ్రహ్మ దేవుని రక్షించమని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు ఈ తారకాసుర భంజనానికి శివకుమారుడే తగిన వాడని పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని జరిపితే వారికి కుమారుడు ఉదయంచి ఆ కుమారుడేఈ తారకాసుర సంహారం చేస్తాడని చెప్పారట.
అపుడు దేవతలంతా కలసి హిమవంతుని కుమార్తె అయన పార్వతికి, మహేశ్వరుడికి వివాహాన్ని జరిపించాలని తలిచారు. కాని తపస్సు లో మునిగిన మహేశ్వరునికి తపోభంగం చేయ డానికి మన్మథుని సహాయంకోరి ఆయన్ను శివ తపోభూమికి పంపించారు. మన్మథుడు తన పూబాణాలతో శివతపస్సును భగ్నం చేయాలని వసంతఋతువును పురికొల్పగా శివుడు కనులు తెరిచి మన్మథుణ్ణి కోపంగా చూచాడు. అంటే ఆ శివకోపాగ్నిలో మన్మథుడు దగ్ధం అయపోయాడు. రతి ఎంతో బాధపడి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని అసలు విషయం చెప్పిందట. అందుకే మన్మథుడు రతి ఒక్కదానికి సశరీరంతోను, మిగతావారికి అనంగుడుగాను కనిపించేలా వరం ఇచ్చాడట. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది కుమారుడు ఉదయంచాడు. తారకాసుర సంహారం చేశాడు. ఈ మన్మథుని కథను స్మరించుకుని కామదహనం జరిపి మానవులు ధర్మాచరణతో తమ తమకోరికలు తీర్చుకోవాలనే మన్మథ పున్నమి ని జరుపుతారు. వసంతఋతువు ఆగమనానికి ఆహ్వానం పలుకడానికి ఈరోజున రంగు రంగుల పూవులను, రంగులను ఒకరిమీద ఒకరు చల్లుకుంటూ హోలి పండుగను చేసు కొంటారు. ఈ హోలి వెనుక మరెన్నో గాథలు న్నాయ. అవి అన్నీ కూడా మానవులు ధర్మాచరణ చేయమని ధర్మాన్ని ఆచరించేవారికి దైవకృప ఉంటుందని చెప్తాయ. ఈ హోలీ పండుగ భారతీయంలోని భిన్నత్వంలోని ఏకత్వాన్ని చిహ్నం. హోలీ పండుగ అటు ఆధ్యాత్మికానందాన్ని ఇటు మానసికానందాన్ని ఇస్తుంది.

- నాగలక్ష్మి