Others

ధర్మస్వరూపుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిగ్రహం, సదాచారం లాంటి సద్గుణాలు ఎవరికి ఉన్నాయని వాల్మీకి నారదుణ్ణి అడిగి తెలుసుకొని మరీ రామాయణాన్ని రచించాడు. కలియుగంలో ఉన్న మనం మాతృప్రేమ, పితృప్రేమ, భ్రాతృప్రేమ, ఏకపత్నీవ్రతం ఇలాంటి సజ్జన లక్షణాల గురించి తెలుసుకోవాలంటే ఆదర్శపురుషునిగా ఎదగాలంటే రామాయణం ఒక్కటి చదివితే చాలు. మనిషిగా బతకడమెలాగో తెలుస్తుంది. భారతాన్ని చదివితే మానవుల్లో ఉన్న దుష టప్రవర్తనలు ఎలా దూరం చేసుకోవాలో అహర్నిశమూ కృష్ణనామాన్ని ఎలా జపించాలో తెలుస్తుంది. ఇలా మన ఉపనిషత్తులూ, వేదమూ రామాయణాది కావ్యాలు గ్రంథాలు మనిషిని మానవత్వంతో ఎలా బతకవచ్చో నేర్పిస్తాయ. వాటి అన్నింటినీ ఉగ్గుపాలతో రంగరించి సేవించినట్లుగా భారతీయులల్లో పండితులకైనా పామరులకైనా వాటిపై పట్టు ఉంటుంది. దాంపత్య ధర్మం గురించి తెలుసుకోవాలంటే రాముని మనసులోని సీతమ్మను గురించి, సీతమ్మ మనసులోని రాముని గురించి చదివి తెలుసు కోవలసిందే. వారిద్దరూ అనురూపులన్న ఖ్యాతిని తెచ్చుకున్నవైనాన్ని అర్థం చేసుకొంటే ఈనాడు పెచ్చులూడుతున్న దాంపత్య వ్యవస్థ మరలా బిగుసుకుంటుంది. అందుకే పాఠ్యపుస్తకాల్లో రామాయ ణాదులను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. తార తన భర్తను మృత్యువాత పడేట్లు చేసినా, మండోదరి తన భర్తను సంహరించినా సరే వారిద్దరూ రాముణ్ణి కించిత్తు మాట అనకుండా ఉన్నారు అంటే అక్కడ రామునిలోని ధర్మాచరణ ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. ప్రపంచానికి ఆదర్శవంతమైన భారత రాజ్య నిర్మాణానికి వారే కారకులు కావాలి. అంతేకాదు రాక్షసుడైన మారీచుడు రామనామా మృతానికి దాసుడయ్యాడు రామ అన్నపదం.... శబ్దం.... విన్నంతనే మధురమైన ఆనంద భావనతోపాటుగా సజ్జనులకు మనసున మలయమారుతాలు వీస్తే శత్రువుల గుండెల్లో అతిభీకరమైన ప్రచండమైన ప్రళయం సంభవిస్తుందనే ఆలోచనలు కలుగుతాయ కదా కనుక నీవు రామునితో యుద్ధానికి వెళ్లాలన్న ఆలోచన మానుకో. నీ దుర్నీతిని వదలి సీతమ్మను రామునికి సమర్పించు. దీనివల్లనీవు బతకడమే కాదు, నీ వంశమంతా రక్షించబడుతుంది. రాముని నీడలో ఉండే సర్వసౌఖ్యాలు రాముని ఎదిరిస్తే ఉండవు. పోతపోసిన ధర్మమే రాముడు అని పదే పదే రావణుడికి చెప్పాడంటే రాక్షసులకు సైతం రామ నామమెంతో మధురమైందో రాముడెంత ధర్మవీరుడో తెలుస్తుంది. అందుకే నేటి బాలలంతా రాముళ్లు కావాలి. రామరాజ్యనిర్మాణం జరగాలి.

- శ్రీ