Others

పట్టుదలకు ప్రతిరూపం రామభక్త ఆంజనేయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదర్శపురుషోత్తమునిగా ఆరాధించే రాముని బంటు ఆంజనేయుడు. రామ భక్త హనుమంతునిగా పిల్లా పెద్దలకు సుపరిచితుడు. ఈ ఆంజనేయుణ్ణి ప్రతివారు పూజిస్తారు. రామాయణానికి నాయకుడు శ్రీరామచంద్రుడైతే సుందరకాండకు నాయకుడు ఆంజనేయస్వామి. చీడపీడలను గ్రహ దోషాలను భూతప్రేత పిశాచాల బాధనుంచి దూరంకావడానికి ఈ ఆంజనేయుని స్మరి స్తారు. ఆత్మ విశ్వాసానికి ధైర్యానికి మారు పేరు మారుతి. ఆంజనేయుడు ఎంతటి రామ భక్తుడంటే రావణునికి బుద్ధి గరపడానికి వెళ్లి రావణుని ఎదురుగా కూర్చుని తన్ను తాను పరిచయం చేసుకోవడానికి గాను ‘‘అహం కౌసలేంద్రస్య దాసః’’అంటాడు. ఎక్కడైనా రాముని సేవకుడిగాను కనిపిస్తాడు ఆంజనేయుడు. కాని ఈ ఆంజనేయుడు చిరంజీవుల్లో ఒకడు. రాబోయే కాలానికి అధిపతి కూడా ఆంజనేయుడే.
యత్ర యత్ర రఘునాధ కీర్తనం....
మారుతిం నమత రాక్షసాంతకం.
ఎక్కడైతే రామనామ సంకీర్తనం ఉంటుందో అక్కడ ముకుళిత హస్తుడై కన్నీరు కారుతుండగా ఆంజనేయుడు మోకాలిపై కూర్చుని ఉంటాడు. అటువంటి మారుతి రాక్షసులను హతమార్చడంలో భీకర స్వరూపం చూపే మహాబలుడు. అవిక్రమ పరాక్రమో పేతుడు, ఇంద్రియ నిగ్రహుడు, ఆత్మస్థైర్యంగలవాడు, దృఢదీక్షా పరుడు. తాను ఏ పని చేసినా అది రామ కార్యంగా భావించే హనుమ సీతా నే్వషణలో సీతమ్మను కనుకొన లేక పోయనప్పుడు కూడా రామునికే తనకు సీతమ్మ కనిపించేట్టు చేయమని ‘‘నమోస్తు రామాయ సలక్ష్మణాయ ............మారుర్గణేబ్యో’’ అంటూ వేడుకున్నాడు. ఇట్లాంటి హనుమంతుడు సూర్యోపాసన చేసి ఆ సర్వసాక్షిని తనకు గురువు గా లభింపచేసుకొని సర్వ శాస్త్రాలను పఠించాడు. అపశబ్దం పలుక ని ధీరగంభీరస్వరుడని శాంత చిత్తుడని రాముని చేత కీర్తింపబడ్డాడు. అట్లాంటి ఆంజనేయుడు కనుకనే సీతానే్వషణలో స్వయంప్రభ కనిపిస్తే దైవస్వరూపంగా ఆమెను భావించి తమకు దాహార్తిని తీర్చి తమకు కాలం అనుకూలంగా మారడానికి మార్గం చూపించమన్నాడు. సీతమ్మ జాడ తెలిపి సీతారాములను కలిపి అటు కౌసల్యాదులైన అయోధ్య వాసులకు ఇటు సుగ్రీవాదులైన వానరుల కు ముదాన్ని కూర్చినవాడు మారుతి. ఆత్మ విశ్వాసానికి కార్యాన్ని ఎలా జయప్రదం చేసుకోవాన్న దానికి మార్గ దర్శి మారుతి. వసంత నవరాత్రుల్లో మారుతిని పూజించిన వారికి సునిశిత బుద్ధిని ప్రసాదిస్తాడని పెదదలంటారు.
ఇంతటి మహానుభావుడైన మారుతి విభీషణుడు రాముని శరణుగోరి వచ్చి నపుడు అందరూ అభయం ఇవ్వద్దుఅని చెప్తే శ్రీరామా నాకు తోచిన విషయం చెప్తాను ఆపై నిర్ణయం నీదేనని చెప్పి. ఈ విభీషణుని మాటలలో కాని, అతని ముఖ కవళికలలో కాని మోసం కపటం కనిపించడంలేదు. రామచంద్ర ప్రభూ! విభీషణుని మాటలలో దురుద్ద్యేశం ఏమీ ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. విభీషణుడు కావాలనే... మనస్ఫూర్తిగా ఇక్కడకు వచ్చాడు. పైగా దుర్మార్గుడైన రావణుని వధించి లంకా రాజ్యాన్ని తనకిప్పించమనే అభ్యర్థన ఇతనికి ఉన్నట్టు నాకు తెలుసతోంది. అందువల్ల విభీషణుని చేరదీస్తే, అతని సహాయంతో రావణునికి బుద్ధిచెప్పవచ్చు. విభీషణుని కోరిక తీర్చవచ్చు . మన కార్యాన్ని కూడా సులభతరం చేసుకోవచ్చు అని ముందుచూపుతో చెప్పాడు. మారుతి చెప్పిన మీదటే రాముని తన్ను శరణుఅన్నవారు శత్రువు లైనా వారిని కాపాడుతానని అభయం ఇచ్చాడు.

- నాగలక్ష్మి