Others

మూర్త్భీవించిన ధీరత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భ క్షకులు ఉండిన స్థలంలో రక్షకులు తప్పనిసరిగా ఉండాల్సిందే అంటాడు రాముడు. ఆయుధాలను ధరించి వనవాసానికి బయలుదేరిన రామలక్ష్మణులను సీతమ్మ అనుసరిస్తుంది. ఓ హంతకుడుగా మారిన ఓ సన్యాసి కథను చెప్పిన జానకి మునుల మాదిరి జీవితాన్ని గడపడానికి అస్తశ్రస్త్రాలు అక్కర్లేదంటుంది. రాముడు తాపసుల జోలికి రాకూడదన్న ఇంగిత జ్ఞానం లేని రాకాసులు వారిని ఇబ్బందులు పాలు చేస్తున్నపుడు అస్తశ్రస్త్రాలు అవసరమే నంటాడు రాముడు.
క్షాత్ర ధర్మమనేది కేవలం న్యాయాన్ని రక్షించడానికి అవసరం. అధర్మాన్ని, అన్యాయాన్ని కాలరాయడానికి దండం పట్టాల్సిందే నంటుంది రామాయణం. సామదాన దండోపాయాల్లో చివరిది అయిన దండాన్ని బాగా ఆలోచించిన మీదటనే ఉపయోగించాలి అనేది రామాయణం చెప్తుంది. విభీషణుడు శత్రుపక్షం నుంచి వచ్చి తన్ను రక్షించమని అడిగినపుడు రాముడు తన్ను శరణు కోరిన వారిని రక్షించడం తన ధర్మమని చెప్తాడు. అట్లా అని దురహంకారంతో మెసిలితే దునుమాడుతానని హెచ్చరిస్తాడు. సముద్రుడు తనకు దారి ఇవ్వనపుడు రామునిలో మనకు ధర్మాగ్రహం కనబడుతుంది. వాలిని సంహరించినపుడు, రావణుణ్ణి నిహితుణ్ణి చేసినపుడు కూడా రామునిలో ధర్మాగ్రహమే. రావణుడు నిరాయుధుడై నపుడు తాను శరప్రయోగం చేయకుండానే తిరిగి వెళ్లి ఆలోచించుకుని ఆయుధం పట్టి తిరిగి కదనరంగానికి రమ్మని పంపించడంలో రాముని దయార్ధ్ర హృదయం తొంగిచూస్తుంది. జటాయువు తనకు సాయం చేసి ప్రాణాలు కోల్పోతే సొంత తండ్రినే కోల్పోయినంత బాధను వ్యక్తం చేస్తాడు. పైగా ఆ పక్షిరాజుకు అంత్యేష్ఠి కూడా జరుపుతాడు. అట్లాంటి రాముని చూచినపుడు రామునిలో దయ, ప్రేమానురాగాలు బయటపడుతాయి. అందుకే రాముడిని మూర్త్భీవించిన ధర్మమూర్తి అన్నారు. ఎక్కడ క్షాత్రశక్తి చూపించాలో అక్కడ చూపించడం, ఎక్కడ మానవత్వం చూపించాలో అక్కడ మానవత్వంతో మెసలడం అనేది రామునికి వెన్నతో పెట్టిన విద్య. రాముని ఆదర్శంగా తీసుకొన్నవారు కూడా సత్యధర్మాలను గట్టిగా పట్టుకొనే ప్రేమమయ జీవితాన్ని గడపడానికి ముందజ వేయాలి. కైకతో, సీతతో, లక్ష్మణునితో, కౌసల్యాదులతో, సుమంత్ర వశిష్ఠాదులతో, తండ్రితో రాముడు అరణ్యానికి వెళ్లేముందు మాటాడిన తీరు, లక్ష్మణుడు ఆవేశపరుడైనప్పుడు మాట్లాడిన తీరు, చిత్రకూటానికి భరతుడు వచ్చినపుడు ప్రసంగించిన తీరు ప్రతివారు అవగాహన చేసుకోవాలి.
సీత అపహరణకు గురైనప్పుడు రాముడు బాధననుభవించాడు. ఏడ్చాడు. కాని ఆయన స్థిరచిత్తాన్ని కోల్పోలేదు. వెంటనే అనే్వషణకు పూనుకొన్నాడు, అపహరణకర్తను అంతం చేసేందుకు ఎందరి సహాయమో స్వీకరించాడు, ఒక్క లక్ష్మణుని మూర్ఛ సందర్భంలో తప్పిస్తే ఏ క్షణాన ఆయన ధీరచిత్తం సడలలేదు! శ్రీరామునిలా ధీరోదాత్తత మనమూ సాధించే ప్రయత్నం చేసితీరాలి. అపుడే నేడు పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం, అసాంఘిక కార్యకలపాలను తుదముట్టించడానికి, కులాల చిచ్చు, మతాల అగ్ని చల్లారడానికి అందరిలో మానవత్వం విల్లివిరయడానికి రాముని అయనాన్ని పరిశీలించాలి. రాముని గూర్చిన అవగాహన కల్పించాలి. పాఠ్యపుస్తకాల్లో రాముని వాల్మీకి ప్రోక్తమైన రాముని కథను చొప్పించాలి. రామునిలాగా సమబుద్ధి ఏర్పడ్డానికి, సంతోషానికి పొంగిపోక దుఃఖానికి కుంగిపోక ధీరత్వంతో ఉండాలంటే రాముని గూర్చి పూర్తిగా తెలుసుకోవాలి. రామానుజుల భాతృభక్తిని, గుహుడు, సుగ్రీవుడు లాంటి స్నేహతత్వాన్ని పరిశీలించాలి. సీతమ్మ, అనసూయ, అహల్య, మండోదరిలాంటి నారీమణులను నేటి తరానికి చిరపరిచితులుగా చేయాలి. ఇలాంటి ఉత్తముల జీవన సన్నివేశాలను గ్రహించి మనమూ ఉత్తములుగా మసలుదాం. నీతి న్యాయాలను నిలబెట్టే రాముళ్లమవుదాం.

- హనుమాయమ్మ