Others

అనర్థ హేతువు అహంకారమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర తి అవతారం పరమార్ధంతో కూడి ఉంటుంది. అవధి లేని ప్రతి అనుభూతికి ఆనందమే పరమార్థం. దయాదక్షాలతో స్వామి రక్షణ ఉంటుంది. దేవతలైనా రాక్షసులైనా వారి అహంకార నిర్మూలనకు శిక్షపడుతుంది. ధర్మరక్షణకు, సాధు జన పోషణకు మహావిష్ణువు పదావతారములు ఎత్తవలిసి వచ్చింది. అందులోనిదే వామనావతారము. అవతారములోకెల్లా ఈ అవతారం విశిష్టమైనది. ఐదవాతారము.
‘మత్స్య కూర్మ వరాహశ్చనారసింహాశ్చ వామనః’’
అని భాగవతం పలికింది. సత్యం పలికింది మార్గం చూపింది. ఇంద్రుడు పదవీ ఐశ్వర్య అహంకారమదంతో కన్నుమిన్ను కానక దుర్వాసుడు ఇచ్చిన దైవప్రసాదమైన పుష్కర మాలను ఐరావత మెడలో వేసి, ఋషిని పరాభవించినందుకు, పదవీ ఐశ్వర్య విహీనుడైనాడు. బలిచక్రవర్తి, ఐశ్వర్య వంతుడై రాక్షస కృత్యములతో, దేవతలను, మహాత్ములను, మహాఋషులను అవమానపరచటంతో, దేవతలు విష్ణుమూర్తిని శరణు వేడారు. వీరిద్దరినీ ఉద్ధరించుటకై విష్ణుమూర్తి వామనావతారం ఎత్తవల్సి వచ్చింది. కొండంత దేవుడు కొద్దిగాయై బలిచక్రవర్తిని దానమడుగవచ్చాడు, నాటి స్వామి.
బలిచక్రవర్తి అహంభావమును అణచుటకై భగవంతుడు వామనావతారము నెత్తెను. వామనుని రూపములో ఝరీపంచ, ఝరీ ఉత్తరీయము, కాళ్లకు పావుకోళ్లు, ఒక చేతులో గొడుగు, మరో చేతిలో కమండలము, శిరస్సునందు చిన్న పిలక, వక్షస్థలమున తులసీమాల నొసటన మూడు నామాలతో ముచ్చట గొల్పుతున్న చిన్న బాల బ్రాహ్మణుడు, బలిచక్రవర్తి యజ్ఞము చేయు, సమయములో వచ్చెను. యజ్ఞము పూర్తియైన పిదప బ్రాహ్మణులకు దానము ఇచ్చు సమయమున, వామన రూపంలో ఉన్న భగవంతుడు విష్ణుమూర్తి కనిపించెను. మా పుణ్యంకొద్ది యజ్ఞమునకు ధానము స్వీకరించ ఏతెంచినారు. ఏమి కావలనో కోరుకోమనెను. ఏమి కావలెనో, ఎంత కావలెనో సంకోచించకుండా అడగమని రెండు చేతులు జోడించి వినయముతో వటబ్రహ్మచారికి నమస్కరించి పలికెను. బలిచక్రవర్తి వినయ విధేయతలకు సంతసించి, రాజా నాకేమీ మణులు, మాణిక్యాలు, ఎటువంటి సంపద నాకవసరము లేదు, ఏదో మూడు అడుగుల భూమి అవసరమైయున్నది. ఆకొద్ది స్థలమిస్తే నే సంతోషంగా వెళ్లిపోతానంటాడు. ఆ నటన సూత్రధారి. వటుడన్నదానికి బలిచక్రవర్తి సంతృప్తి చెందలేదు. మరియొకసారి ప్రార్థించి సంతృప్తినిచ్చే కోరిక కోరమన్నాడు, దానికి బ్రహ్మచారి రూపంలో ఉన్న పరమాత్మనాకేమొద్దు. మూడు అడుగుల భూమి దానమివ్వమని అడిగినాడు. గురువైన శుక్రాచార్యుడు చెప్పినా వినకుండా బలి దానమివ్వడానికి ముందుకు వచ్చాడు.
బలిచక్రవర్తి మూడడుగుల భూమి దానముతో దానగ్రహీత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వటువు. వామన రూపంలో ఉన్న ఆకారం నుండి విశ్వవ్యాప్తుడిగా విష్ణుమూర్తిగా అవతరించాడు. ఒక పాదము, భూమండలమంతా ఆక్రమించింది. రెండవ పాదము, ఆకాశమంతా ఆక్రమించింది. ఆకాశంలో ఆక్రమించిన పాదము చూసిన దేవతలు, బ్రహ్మదేవుడు మొదలగువారు. స్వామి దొరకదని, ఆ పాదమును కడిగి సంతోషించినారు.ఇక మూడవ పాదము మిగిలింది. ఈ పాదము వైకుంఠవాసుడైన విష్ణుమూర్తిగా అభివర్ణించారు పండితులు. అభేద భక్తులు, ఆ పాదంతో బలిచక్రవర్తి శిరస్సు చూపగా ఆ కాలుపై శ్రీ మహావిష్ణువు పాదము పెట్టి పాతాళ లోకమునకు పంపి రాజ్యమేలమన్నాడు. మూడు పాదములు, భూమిపై ఉన్నది విష్ణుమూర్తిగా, ఆకాశము చేరిన పాదము బ్రహ్మ కడిగిన పాదముగా మూడవ పాదము లయ కారడు ఈశ్వరుడిగా ఆ మహత్యముగల దృశ్యము చూసి ఆకాశము నుండి పుష్పవర్షము కురిసినది.

- జమలాపురం ప్రసాదరావు