Others

కృష్ణచరితం.. మహిమాన్వితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుంసాం మోహనరూపాయా అని రాముడిని సంబోధిస్తాం. రమయతే రామః కదా. రమ శబ్దమే ఆనందానికి చిహ్నం. ఆనందానికి కారణమైన రాముని మోము కళ్లముందు కనబడేట్టు చేస్తుంది కనుకనే రాముడుఅందగాడు అని వేరుగా చెప్పనక్కర్లే కుండానే తెలుస్తుంది. రాముడు మానుషవేషధారి. ఆయన లీలలు చూపలేదు. తాను దశరథపుత్రుడినని తండ్రి మమకారానికి, తల్లి వాత్సల్యానికి కట్టుబడి ఉన్నానని అన్నాడు. అంచేతే రాముడు అవతార పురుషుడు అయినా మానవ మాత్రుడిగానే ఆయన జీవితం సాగింది. తండ్రి మాటను జవదాటని కుమారుడుగా చరిత్రకెక్కాడు. రాక్షసుల బారిన పడిన తన భార్యను తిరిగి చేజిక్కించుకునే దాకా సామాన్యునివలె విలపిం చాడు. భార్యా వియోగాన్ని అనుభవించాడు. రావణా సురునితో పోరాడాడు. లంకపై విజయం సాధించ డానికి వానరుల సాయం తీసుకొన్నాడు. అగస్త్యుల లాంటి వారి ఉపదేశంతో సూర్యోపాసన చేశాడు. భగవంతుని దయవలనే రావణాసుర సంహారం జరిగిందని లోకానికి వెల్లడి చేశాడు. అటువంటి రాముడు చారిత్రిక పురుషుడుగా ఆదర్శ రాజుగా నేటికి జనుల మనస్సుల్లో నిలిచి ఉన్నాడు. రామరాజ్యమే కావాలని కలియుగం లోని వారందరూ ఏకోన్ముఖంగా కోరుకుంటారు. అట్లానే కృష్ణుడు అంటే ఆకర్షించేవాడు. కృష్ణ శబ్దానికి ఆకర్షించుట, లాగికొనుట అన్న అర్థాలున్నాయ. సజ్జనులైనా, దుర్జనులైనా కృష్ణ నామంలో ఆకర్షించ బడేది కృష్ణ అన్నశబ్దానికే. కృష్ణుని జీవితం ఆదినుంచి హాంపట్ జాంపట్‌లతో విశేష విలాస లీలలు కృష్ణుడు అవతార మూర్తిఅని చెప్పకనే తెలిసేట్టు చేశాయ. రాముని చరితం ఆదర్శ చరితం. కృష్ణుని జీవితం మహిమల భరితం. అందుచేత రాముడు చేసినట్టు చేయమన్నారు. కృష్ణుడు చెప్పినట్టు చేయమన్నారు. కృష్ణుడు పుట్టుక నుండి అవతార పరిసమాప్తివరకు అత్యంతద్భుత కథా విశేషాలే.
దేవకీ వసుదేవులకు పూర్వజన్మ పుణ్యపరిపాకం వల్ల మహావిష్ణువు తన అవతార విభవంలో పుట్టీ పుట్టగానే నీలమేఘవర్ణశరీరంతో నాలుగుభుజాలతో శంఖ, చక్ర, గదా పద్మాలతో అలరారుతూ సాక్షాత్కరించి తాను ఎందుకు పుట్టాడో దేవకీ వసుదేవులు చేయవలసిన పనులేమిటో కూడా వివరించి మళ్లీ అతి చిన్నారి బాలునిగా మారిపోయాడు ఆ మాయలమారి కృష్ణయ్య. ఆ కృష్ణయ్యచరితానే్న ఆయన చేసిన ఘనమైన పనులనే స్మరిస్తూ చెబుతూ తరిస్తూ రచించిన భాగవతానికే కల్యాణాత్మకమైన విష్ణు కథలు అన్న నిర్వచనం ఇచ్చాడు పోతన. రాముడు చరితంలో ఏక పత్నీ వ్రతం గోచరిస్తుంది. కృష్ణుని చరితంలో అనేక సతీ వివాహాలు దృశ్యమానమై సత్యభక్తికి నిదర్శనాలు నిలుస్తాయ. రాముని చరితంలో ఎక్కువగా ఘనత కెక్కిన విష యాలు లేక సంఘటనా ఘట్టాలన్నీ ఆయన పెద్దయ్యాకే. పరమాత్ముడు కృష్ణుని చరితం మాత్రం బాల్యం నుండి అద్భుత ఆశ్చర్య జనక ఘట్టాలే.
కీర్తినిచ్చే చరిత్ర రామునిదైతే యశాన్నిచ్చే యశోదా పుత్రుని చరిత్ర ఇది. యశ అంటే యశస్సు దా అంటే ఇచ్చునది. సర్వ విశ్వసాక్షాత్కారం విశ్వరూప దర్శనంగా చిన్ని నోటిలో చూపిన కన్నయ్య అతడు. రాక్షసులను తునుమాడిన పెదయ్యా అతడే. తాను జన్మించడం వలన కారాగారానికే కీర్తి తెచ్చిన ఘనుడతడు . అంతేకాదు ఆ పరమాత్ముని లీలావిలాసాలు తెలుసుకొనగల శక్తిమంతులు ఎవరుంటారు? అందుకే గజేంద్రుడు ఈ జగత్తంతా ఎవనినుంచి పుడుతోందో ఎవనిలో లయం అవుతోందో, అసలీ విశ్వానికి మూలకారణమెవ్వడో వానినే నేను శరణు వేడుతాను అని పలికాడు. అలా పలికినా మొర వినని జగన్నాథుని గజేంద్రుడు అలసి సొలసి అసలుకలండు కలండు అనువాడు అసలంటూ ఉన్నాడా అనిప్రశ్నించాడు. చివరా ఖరికి కారుచీకట్లకు ఆవల నిత్యమై సత్యమై వెలుగొందే ఓ పరంజ్యోతీ! ఇక నాకు ఒక్కింత కూడా ఓపిక లేదు..నా ప్రాణముల్ ఠావుల్ తప్పే ... రావే ఈశ్వరా! కావవే వరదా అంటూ ఎలుగెత్తి అరిచాడు. అలా అరిచిన గజేంద్రుడే మరలా తన్ను కాపాడడానికి అలవైకుంఠపురంబులో నగరిలో... అంటూ అక్కడ ఉండేవాడు మాత్రమే తన్ను కాపాడడానికి రావాలంటూ ప్రార్థించాడు. అలాప్రార్థనలు అందుకున్నవాడిని గూర్చే ప్రహ్లాదుడు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నాడు. అటువంటి ఆ వేయివెలుగుల చిన్నారిని గురించి, చిన్మయుని గురించి ... ఇన్ని విస్పష్ట స్పష్ట అదృష్ట చరిత్ర శ్రీకృష్ణుల వారిది. అందుకే బాల్యమాదిగా ఆ మహానుభావుడి జీవన అంశ కాంతి ఘట్టాలను మనమూ స్మరించుకుందాం.

- చరణశ్రీ