Others

వినాయకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణనాధా
గణాంకాల కూడికలు
తీసివేతలతో
కాలయాపన చేస్తూ
ఎప్పుడో మంచికాలం వస్తుందని
ఎదురుచూస్తున్న అమాయకులం

ఒక్కటి ఎక్కువైతే తప్పు
ఒక్కటి తక్కువైతే ముప్పు
ఇలా ముప్పతిప్పలు పడుతున్న మాకు
నీ రాక ఎంత ఆనందమో చెప్పలేము

గరిక తీసికొని
గిరినెక్కించే దేవుడా
నిరంతరమూ నిన్ను తలచుకున్నా

శుభప్రదమైన
ఈ భద్రపద చవితిరోజు
మా యిండ్లకు వచ్చి
‘ఆవాహయామి’ అనగానే
పరవశంతో మా పూజలందుకొని
నాలుగు ఉండ్రాళ్ళు నైవేద్యమిస్తే-
ఓ మూషిక వాహనా
‘నిర్విఘ్నమస్తు’ అని దీవించి

దసరా, దీపావళి సంతోషంగా
జరుపుకొమ్మని
కోరినవన్నీ యిచ్చి వెళ్తావు
వచ్చే సంవత్సరం
మళ్లీ నీవొచ్చేవరకూ

ఏ కలతా, కలవరమూ లేకుండా
కాపాడవయ్యా
ఏకదంతా
అనుగ్రహానంతా.

-ఎ.ఎస్.ప్రభాకర్