Others

‘గణనాయకా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూషికవాహనరూపా
ముల్లోకాలకు అధినేతా
మానవజీవిత మర్మాన్ని
ఒక్క వాహనరూపుతో
ఎరుక పరిచి
ముక్కోటి దేవతలకు
ఆదిదేవునివయ్యావు

విఘ్నాలను హరియంచి
లగ్నాలను నడిపించి
ముప్పతిప్పలు పడే మాకు
ముందుచూపు నేర్పావు

గరిక ప్రియుడివి నీవు
గణాథ్యక్షునివి నీవు
గమ్యం చేరడానికి దిక్చూచి నీవు
గండాలకు అధిదేవుడివే నీవు

సిద్ధిబుద్ధి నీ దేవేరులు
బుద్ధిసిద్ధిప్రదాతలు మీరే
భాద్రపదాన శుభప్రదం అంటూ
వస్తావు అంతటా నేనే నంటూ

మట్టినే మాణిక్యమంటావు
ఆకులలములే రత్నాలంటావు
కుడుములుండ్రాళ్లు తిని
ఇడుములను బాపుతావు
విఘ్నేశ జయహ జయహ

-ఆర్.శర్వాణి