Others

ప్రకృతి చెప్పే పాఠం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టిన జీవి మరణించక తప్పదు. మరణించిన జీవి మరలా పుట్టడం తప్పదు. అయతే మరణించిన జీవి మరలా పుట్టుతూనే ఉందా లేదా అన్నది తెలియని విషయం కాని పుట్టిన ప్రతి జీవి మాత్రం మరణిస్తూనే ఉంది. ఈ జననమరణాల మధ్య ఉన్న జీవితం లో చేసే మంచిచెడులు మాత్రం వాటి ఫలితాలను ఆ జీవే భరిస్తుందనేది అందరూ చెప్పేదే. ఏదైనా కష్టం వచ్చిన పుడు ఇదిగో నీవీ పాపం చేసి ఉన్నావు కనుక నీ కీ కష్టం ప్రాప్తించింది అని అంటారు. ప్రతివారు కూడా కష్టం రాగానే నేనేమీ పాపం చేసానో ఇట్లాబాధపడు తున్నాను అంటారు. సంపద వచ్చినపుడు లేకఆనందం వచ్చినపుడు ఏ పూర్వజన్మ పుణ్యమో దేవుడు ఇది అనుగ్రహించాడు అంటారు. లేకపోతే మా పూర్వులు చేసిన పుణ్యఫలంగా ఇది ప్రాప్తమైంది అని అంటారు. గీతాచార్యుడైన కృష్ణుడు కూడా మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి ఫలితాన్ని గూర్చి ఆలోచించకండి ఎవరికే ఫలితం ఇవ్వాలో దాన్ని నేను ఇస్తాను అని అన్నాడు. అసలు మనిషి మానవత్వంతో మెలగాలి. మానవత్వం లేని మనిషి పశుసమానంగా చూడబడుతాడు. త్యాగ గుణం ఉన్నవాడే మనిషి అని,. కేవలం తన గురించే కాక ఇతరుల గురించి మాట్లాడేవాడు ఇతరుల కష్టసుఖాల్లో పాలు పంచుకునేవాడు మాత్రమే మనిషి అని ఈ గుణం ప్రతి మనిషిలో ఏర్పడాలి అంటే ప్రకృతిని పరిశీలించాలని అంటారు. ప్రకృతిలోని గాలి, నీరు, చెట్లు ఇవి అన్నీ కూడా ఇతరులకు ఉపయోగ పడేవే కాని వాటికవి ఏమీ చేసుకోవు కాని అట్లాంటి వాటిని కూడా మనిషి తన స్వార్థంతో తాను ఒక్కడే బాగుండాలన్న కోరికతో కలుషితం చేస్తున్నాడు. ఆ ప్రకృతి కలుషితాల వల్ల చివరకు ప్రకృతి పర్యావరణ సమతుల్యత దెబ్బతిని అది మనిషిపైనే ప్రభావం చూపుతోంది. కనుక తాను ఎవరికో ద్వేషంతో చెడు చేస్తే ఆ చెడు ప్రభావం తిరిగి తన దగ్గరికే వస్తుంది అన్న విషయం ప్రకృతి చెప్పే పాఠం. కనుక క్రితం వారం మనం చేసుకొన్న గణేశచతుర్ధి ని మట్టి వినాయకుళ్ళను పూజించడంలోని పరమార్థాన్ని అర్థం చేసుకొని పూజించినవారికే పరాత్పరుని కటాక్షం లభిస్తుంది. ఆడంబరాలకో, అత్యుత్సాహానికో పోతే చివరకు ఎండిపోయన పూలు అందరికీ పంచగా మిగిలిన ప్రసాదం గినె్నలు మిగులుతాయ. మన వేదం సర్వేజనా సుఖినోభవన్తు అన్న దానికే ప్రాధాన్యత ఇచ్చింది. నలువైపుల నుంచి కూడా మంచి భావనలు నన్ను చేరాలని భగవంతుడిని ప్రార్థించమని వేదం చెబుతుంది. ఇలా నలువైపుల నుంచి అంటే మనసా వాచా కర్మణా కూడా మంచిని మాత్రమే చేస్తున్నపుడు భగవంతుడు మంచినే కలుగచేస్తాడు అన్నది ప్రకృతి నేర్పే పాఠం. అదే వేదపాఠం. కనుక స్వార్థాన్ని వీడి లోకకల్యాణం కోసం శ్రమించాలి.

- హనుమాయమ్మ