Others

శరం లేకుండానే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత దిష్టి తీసేసినా ఇంకా బెదురు తగ్గని గోపవనితలు యశోదకు దిష్టుల గురించే చెప్పసాగారు. యశోద అవి అన్నీవిని మరింత కంగారుపడింది. తనకుమారునికి ఆపదలే కలుగకూడదని ముక్కోటి దేవతలను ప్రార్థించింది. గోపకాంతలు కూడా ఆమె చుట్టూత చేరి గోపాలునికి ‘‘మా పుణ్యాలరాశీ! నీ పాదాలుబ్రహ్మ, మోకాళ్లు వాయువు, తొడలు యజ్ఞుడు నడుము అచ్యుతుడు, కడుపు హయగ్రీవుడు, హృదయం కేశవుడు, వక్షస్సు ఈశుడు, భుజాలు చతుర్భుజుడు, ముఖము త్రివిక్రముడు శిరస్సు ఈశ్వరుడు కాపాడుగాక! ’’ అని రక్షపెట్టారు. ఇంకా వారికి దిగులు తీరలేదు. మళ్లీ ‘ఓ నవమోహనాకారా! నీ ముందు ఎల్లవేళలా చక్రధరుడైన మహావిష్ణువు, కుడిపక్క మధువైరి, ఎడమపక్క అజనుడు, గోణములలో శంకచక్రగదాధరుడైన ఉరుగాయుడు, మీద ఉపేంద్రుడైన విష్ణువు, క్రింద గరుత్మంతుడు నీవు ఆడుకునేటపుడు గోవిందుడు, నీవు నిద్రించువేళ మాధవుడు, నడిచేవేళ వైకుంఠుడు, కూర్చునేవేళ శ్రీపతి, నీవు తినేవేళ యజ్ఞ్భుజుడు అప్రమత్తులై నిన్ను కాపాడుదురు గాక! నీలో ప్రాణాలను, ఇంద్రియాలను, శరీరాన్ని బాధించే ఉన్మాదాలు, మూర్ఛలు, మహోత్పాతాలు చేరకుండుగాక’’ అని రక్షకట్టారు. నల్లని శిశువు కాళ్లకు దిష్టి తగలకుండా ఉండాలని నల్లని దారాలు కట్టారు.
యశోదానందుడు మెల్లమెల్లగా ఎదుగుతూ బోర్లా పడడం నేర్చుకున్నాడు. బొబ్బట్లు పంచాలని యశోద ముచ్చట పడింది. అందులోను బాలుని జన్మనక్షత్రం కూడా వచ్చింది. అందుకే వెంటనే గోపాంగనలందరినీ పిలిచింది. కృష్ణయ్యను అందంగా అలంకరించింది. చక్కగా కనులకు కాటుక దిద్ది పాలభాగాన తిలకం దిద్ది అందగాడికి మరింత అందాన్ని చేర్చింది. ఆ పై వచ్చిన అంగనలందరి ముందు పాపడిని పడుకోబెట్టింది. పడుకున్న తడువే బోర్లాపడడం ఆరంభించాడు ఆ చిన్నవాడు. ఆ ఆనందంతో యశోద అందరికీ బొబ్బట్లు పంచింది. పండుతాంబూలాలు ఇచ్చింది. సువర్ణ్భారణాలు, గోవులు, ధాన్యాలు ఇత్యాదులందరికీ పంచిపెట్టింది. ఇవి అన్నీ ఇవ్వడంలో మునిగిన యశోద పిల్లవాని మీద ధ్యాసను మరించిది. పైగా అపుడే చిన్నవాడు ఆవులిస్తుంటే పాలు తాగించి జోలపాడింది. మెల్లమెల్లగా కనులు మూసుకుని నిద్రకు ఉపక్రమించగా పక్కనే పడుకోబెట్టింది. తన పనిలో తానుమునిగిపోయింది.
మాయలకే పెనుమాయ యైన కృష్ణుడిని కడతేర్చాలని కంసుని ప్రేరణతో ఉత్కచుడన్న రాక్షసుడు నందుని ఇంటి దగ్గరకు వచ్చాడు. ఉత్కచునికి ఆకారమే లేదు. అందుకే వాడు నందుని ఇంటిముంగిట ఉన్న శకటాన్ని ఆవరించాడు. ఎపుడు తనకు వీలుగా ఉంటే అప్పుడు పిల్లవానిని చంపుదామని వేచి చూస్తున్నాడు.
నిద్ర నటించి నిద్రలో ఉన్నట్లు ఉన్న చిన్మయుడు శకటాసురుని ఆగడాన్ని చూచాడు. మెల్లమెల్లగా బోర్లాపడుతూ పడుతూ శకటం దగ్గరకు చేరాడు. ఏడుస్తున్నట్లుగా కాళ్లు చేతులు విసురుతూ విసురుతూ మరింత శకటానికి దగ్గరయ్యాడు. ఒకే ఒక తన్నుతో శకటాన్ని విదిలించాడు. అంతే అప్పటిదాకా కీడు చేద్దామని వచ్చిన శకటాన్ని ఆవరించి ఉన్న ఉత్కచుడు ఆమాంతంగా పైకి ఎగిరాడు. అక్కడున్న గోపకాంతలు ఉలిక్కి పడి చూచారు. ఫలహారాల బండి విసురుగా పైకి లేవడం, అంతే విసురుగా కిందపడడంతో ఆ బండి కాస్త ముక్కలుచెక్కలుగా విరిగి పడిపోయింది. శకటాన్ని ఆవరించిన అసురుని ప్రాణాలు కడకట్టిపోయాయి. పైకి ఆవిరి అయిపోయాయి.
అక్కడున్న గోపకాంతలందరూ నిశే్చష్టితులై చూస్తున్నారు. ఒక్కరి నోటి నుంచి కూడా మాట రావడం లేదు. అంతలో ఆ చప్పుడుకు పంచుతున్న పండుతాంబూలాలను వదిలి చటుక్కున తన చిన్నిబాలునికోసం యశోద వచ్చింది. ఆ పగిలి ముక్కలైన బండికిందనే బాలుడే ఏడుస్తూ కాళ్లుచేతులు విసురుతూ ఉన్నాడు. కంటికి పెట్టిన కాటుకనంతా చెరిపేసుకుంటూ ఏడుస్తున్న చిన్నివానిని చేతుల్లో పొదువుకుంటూ ‘ఎంత అదృష్టం మా నాయనకు ఏమీ కాలేదు. చిన్న మెత్తు కూడా దెబ్బతగలలేదు. ఆదేవతలంతా వీనిని కాపాడినట్టు ఉన్నారు. ఈ ఫలహారాలతో నిండి ఉన్న ఈ బండి మీద పడి ఉంటేనా’’ అంటూ ఎంతో వగరుస్తూ పాపడిని గుండెలకు హత్తుకుంటున్న యశోదను అపుడే వచ్చి జరిగిన దాన్ని చూస్తున్న నందుడు చూశాడు. కనుల నీరు నింపుకుంటూ మన పాపడికి ఏంకాలేదు కదా అంటూ దగ్గరకు వచ్చాడు. ఎంతటి మూర్ఖులం మనం. ఏదో చేస్తున్నాము కాని ఎన్నో జన్మల పూర్వపుణ్యఫలంగా దొరికిన ఈ అమృతఫలాన్ని కాపాడుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నాం. అంటూ బాధపడుతూ నందయశోదలు ఇంట్లోకి వెళ్లారు. అలా కృష్ణయ్య శకటాసురభంజనం చేశాడు. మరికొన్ని రోజులు గడిచాయి. మెల్లగా శకటాసుర విషయం మరిచినట్లు ఉన్నారు. ఒకరోజు యశోద తన ఒడిలో కృష్ణుని పడుకోబెట్టుకుని పాలిస్తోంది. కృష్ణుడు కూడా ఎంతో ఆకలితో ఉన్నట్లు పాలుతాగుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి బాలుడు బరువుగా అనిపించసాగాడు యశోదకు. కృష్ణయ్య కూడా కనులు మూసుకుని చన్నును చప్పరిస్తున్న వానిని చూసి నిద్ర పోతున్నాడనుకొంది. బాగా బరువుగా ఉన్నాడని నేలపై పడుకోబెట్టింది. ***

చరణ శ్రీ