Others

సుడిగాలికి కళ్లెం వేసిన సుధాముని చెలికాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడలేని సుడిగాలి రూపంలో తృణావర్తుడను రాక్షసుడు వచ్చాడు. ఊర్లు పోలాలన్నింటా పోడుగాలి వచ్చింది. ఇళ్లు, మనుషులు అంతా ఎగిరిపోతున్నారా అంటూ రుంయి రుంయి అంటూ గాలి మహాశబ్దంతో వీచసాగింది. ఈ గాలిని చూచి ఇంతకుమునుపెన్నడు ఇంతటి సుడిగాలి రాలేదని అనుకొంటూనే గాలికి ఎగిరి వెళ్లేవస్తువులను పట్టుకోవాలంటూ యశోద నెమ్మదిగా కృష్ణుని నేలపై పడుకోబెట్టి లేచింది.
అంతే ఒక్క ఉదుటన సుడిగాలి ఆ ప్రదేశంలో వీచింది. ఆ గాలి గాడ్పుకు చిన్ని కృష్ణుడు ఆమాంతంగా ఎగిరిపోయాడు. యశోద చూస్తుండగానే గాలిలోకి వెళ్లిన పిల్లవాడిని చూచి గావుకేకలు పెట్టింది. ‘‘అయ్యో ఇదేమి గాలి నా పిల్లవానిని తీసుకొని పోయింది ’’అని పెద్దగా అరుస్తోంది. ఆ యశోద అరుపులకు రేపల్లె అంతా ఒక్కటై వచ్చింది.
నందుడు కూడా వచ్చాడు. ఇదేంటని ఏం చేయాలో పాలుపోక ఆకాశంలోకి చూస్తూన్నారు.
యశోద ‘నేనిప్పుడే పాలిచ్చి ఇలా పడుకోబెట్టాను. అంతే నా పిల్లవాడు ఏమైనాడు. ఎక్కడున్నాడు. వానికేమి ఆపదలు వస్తున్నాయి ఇపుడేం చేయాలో ’అని పదేపదే అనుకోసాగింది.
సుడిగాలిలో వచ్చిన తృణావర్తుడు బాలుని తన చేతుల్లో తీసుకొని మహావేగంగా ఆకాశపుటంచులను తాకునట్లుగా ఎగిరి వెళ్తున్నాడు. కాని అంతకంతకు బాలుడు బరువుకాసాగాడంతో బాలుని మరింతగా గుండెలకు హత్తుకున్నాడు. అంతే చేతుల్లోని బాలుడు తృణావర్తుడి మెడను పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు పట్టుకున్నట్లుగానే ఎంతో ఒత్తిడి ని మెడపై కలుగచేస్తున్నాడు. బాలుని చేతుల ఒత్తిడిని తట్టుకోలేని తృణావర్తుడు చేతులను వదిలించుకోవాలని చూశాడు. కాని పట్టువదలని కృష్ణయ్య మరింత గట్టిగా పట్టుకున్నాడు. అంతే దిక్కులు పిక్కటిల్లేట్లుగా గావుకేక పెట్టి దబ్బున కిందపడ్డాడు అంతటి తృణావర్తుడు. తృణావర్తుడి ప్రాణాలు పరమాత్మను చేరాయి. వికృతరూపంతో తృణావర్తుడు గోపకాంత ఎదుట ముక్కుచెవులు పగిలి, చేతులు విరిగి పడ్డాడు. వాని మీద చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ కనిపించాడు వారికి.
ఒక్క ఉదుటున పరుగెత్తి కృష్ణయ్యను తీసుకొని గుండెలకు హత్తుకుంటూ ఏడుస్తున్న యశోద దగ్గరకు పరుగెత్తారు వారు. ‘అమ్మా యశోదమ్మా! ఇదిగోనమ్మా నీ బాలుడు. ఆ రాక్షసుని ఎదపై కూర్చుని ఆడుతున్నాడు. ఎవరో రాక్షసుడు ముక్కలై పడి ఉన్నాడు. అంటూ వారు చూసిన విషయాన్ని విడమర్చి చెప్పారు.
కనులు తుడుచుకుంటూ పరమానందంతో తన చిన్ని కృష్ణుని చేతుల్లోకి తీసుకొంటూ ఈ పాడుగాలి నిన్ను ఎత్తుకెళ్లింది అయ్యో నేను ఎంతటి పాపిష్టిదాన్నో నిన్ను కాపాడుకోలేకపోయాను. దేవదేవుడే నిన్ను రక్షించాడు అంటూ మరలా మరలా ఆ కనిపించని దేవునికి కనిపించే దేవుణ్ణి కాపాడేవు అని యశోద మొక్కింది. గోపకాంతలు అందరూ చాలా జాగ్రత్తగా ఈ చిన్ని పాపని చూడాలని జాగ్రత్తలు చెప్పారు.
ఇలా కొన్ని రోజులు గడిచాయి.
పాపడు దినదినాభివృద్ధి చెందుతూన్నాడు. నందుడు చిన్నవానికి నామకరణోత్సవాలు జరిపిస్తే అరిష్టాలు కూడా తగ్గుముఖం పట్టవచ్చుననుకొన్నాడు. ఆ సమయంలోనే గర్గుడు వచ్చాడు. గర్గమహర్షిని చూచి నందుడు పరమానందం చెందాడు. ఆర్ఘ్యపాద్యాదులిచ్చి ఆసనమిచ్చి గర్గమహర్షిని సంతోషింపచేశాడు. కుశల ప్రశ్నల అనంతరం నందుడు తన మనసులోని మాటను గర్గమహర్షికి చెప్పాడు.
గర్గమహర్షికూడా అపరిమితానందానికి లోనైనాడు. అనంతనామ ధేయునికి నామకరణమా అనుకొన్నాడు.

చరణ శ్రీ