Others

క్షమా చిహ్నమే పాండవపత్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రౌపదిని పరిశీలించినప్పుడు నేటి సమాజంలోని సామాన్య స్ర్తి కనిపిస్తుంది. ఆమె యజ్ఞంలో పుట్టినా, కురువంశంలో మెట్టినా, జనవంద్యుల నుబొందినా, అతిపరాక్రమ వీరులను భర్తలుగా పొందినా ద్రౌపదిలో ఒక సామాన్యస్ర్తినే ఎక్కువగా కనబడుతుంది. ఆమె సంగ్రామానికి హేతువుగా, ప్రేరక శక్తిగా కనిపిస్తుంది. ద్రౌపది తన కొడుకులను పోగొట్టుకున్నప్పటికీ మరో తల్లి అటువంటి దీనావస్థను పొందకూడదనుకొన్న క్షమకలిగిన కొమ్మగానే కనబడుతుంది.
అంతేకాదు నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్న గాంధారీ ధృతరాష్ట్రులకు రాబోయే గడ్డుకాలం భీముని శపథాలతో కనబడుతుంది. అందుకే గాంధారీ ధృతరాష్ట్రులు ద్రౌపదిని ఓదారుస్తూ వరాలనిస్తారు. కాని ఆ వరాలను కూడా ఒక క్షత్రియ కన్యఏవిధంగా కోరుకోవాలో కోరుకుంటుంది. కాని ఇంకా ఏ వరా లు కావాలో కోరుకో తల్లీ అని ధృత రాష్ట్రుడు ఆమె కోపాన్ని తగ్గించడానికి అంటే అక్కర్లేదని తాను అంత కన్నా ఎక్కువ కోరికలు కోరకూడదని చెప్పడం లో ఆమెలో ఓర్పు విచక్షణ లే ఉన్న మహా ఇల్లాలు కనిపిస్తుంది. ఆమె లోకైక సౌందర్యవతి. కాని, తన్ను కాపాడమని చాలాచోట్ల భర్తలను అడుగుతుంది. కీచకులబారినుంచి తన్ను రక్షించమని వేడుకొంటుంది. శ్రీకృష్ణుడు సాయం కూడా కోరింది. అంటే దైవబలాన్ని కాంక్షించింది. ఆమె ధర్మాధర్మాలను పరిక్షించే నేర్పుకలదైనా, ఓర్పుక్షమలకు మారుపేరుగా పేరుతెచ్చుకుంది. దమయంతి కూడా ద్రౌపది లాగే మహాసౌందర్యవతి. ఆమె సౌందర్యానికి దేవతలే దిగి వచ్చారు. కాని ఆమె హితులనుంచి శ్రేయోదాయకులనుంచి నలుని వివరాలను తెలుసుకొంది. నలుణ్ణే వివాహం చేసుకోవాలని ధృడనిశ్చయం చేసుకొంది.ఆమె, ఆమె వరించిన నలుని చేత దేవతలు ప్రేమ రాయబారం పంపారు. దేవతల మాట వినకపోతే వారు మానవులను అష్టకష్టాల పాలు చేయగల శక్తిసంపన్నులని తెలుసు అంటూనే తన స్థిర చిత్తాన్ని వారికి తెలిపి వారి ముందు వారి మన్నన పొంది నలుణ్ణే వివాహం చేసుకొన్న ధీరవనితగా మనకు దమయంతి కనిపిస్తుంది. ఈ ఒక్కచోట నే కాదు ధర్మరాజు లాగే నలుడు కూడా జూదరి. కాలవశమో లేక మరేదో కారణమో కాని ఏ ప్రేరణ వల్లనైనా సరే ధర్మరాజు నలుడు ఇద్దరూ జూదం ఆడారు. దానివల్ల దమయంతి, ద్రౌపది ఇద్దరూ సైరంధ్రులయ్యారు.
దమయంతి తనను వీడిపోయిన భర్తనుకనుగొనడానికి బ్రాహ్మణులను పంపించడం ఆ పంపించడంలో తన ఆవేదనకు స్పందనిచ్చినవారే నలుడయ్యే అవకాశం ఉందని అనుకోవడం, తనకు రెండవ స్వయంవరాన్ని ఏర్పాటు చేయించడం, దానికి ఒక్క ఋతుపర్ణునికే ఆహ్వానం పంపండం, ఇందులో కూడా నలుని గుర్తించడానికి అశ్వప్రయాణ వేగాన్ని తెలుసుకోవడం, బాహుకుని వేషంలో ఉన్న నలుని పాకరుచిని గుర్తించబూనడం, తన బిడ్డలను పంపించి తండ్రి అప్యాయతానురాగాలను బయల్పర్చడానికి అవకాశం ఇవ్వడం.. ఇలాంటివన్నీ చూస్తే ద్రౌపది కన్నా దమయంతి తన్ను తాను రక్షించుకోవడానికి కావాల్సిన సమయస్ఫూర్తి, వివేక విచక్షణాలు గల స్ర్తిగా మనకు కనిపిస్తుంది.ద్రౌపదిలో కూడా దేవతలను మెప్పించే శక్తి ఉన్నట్టుగా మనకు భారతమే చెబుతుంది.
దమయంతికి కలిగిన సంఘటనలు ద్రౌపదికి కలగనందున కూడా మనకు ద్రౌపది ఆ విచక్షణ ఉన్నట్టు కనిపించపోవడానికి కారణమై ఉండవచ్చు.

- రాయసం లక్ష్మి