Others

అనంతనామధేయునికి నామకరణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతనామధేయునికి నామకరణోత్సవానికి నేను కర్తను కావడం ఎంత అదృష్టం అనుకొన్నాడు గర్గమహర్షి. గర్గుడు నందుని పిలిచి నామకరణోత్సవానికి ఏర్పాట్లు ఏవిధంగా చేయాలో చెప్పి చేయించాడు. ముందుగా రోహిణీ దేవికి పుట్టిన పిల్లవానికి నామకరణం చేస్తూ ఈ శిశువు పెరిగి పెద్దవాడై వంశానికే బలంగా తయారు అవుతాడు కనుక బలరాముడు అన్న పేరు స్థిరం చేయమని చెప్పారు. గర్భసంకర్షణ వల్ల పుట్టాడు కనుక సంకర్షణుడన్న నామంతో ప్రసిద్ధిచెందుతాడని దీవించారు. వారు వీరను తేడాలేకుండా అందరినీ ఆదరిస్తాడు. అందరికీ ఆనందాన్ని పంచుతాడు కనుక రాముడు అన్న పేరుతో విఖ్యాతుడవుతాడని గర్గమహర్షి రాముడు అన్న పేరును స్థిరం చేశారు.
ఆ తరువాత యశోదనందుల బిడ్డడికి నామకరణోత్సవానికి పూనుకొన్నారు. అపుడు గర్గ మహర్షి.. ‘‘అయ్యా! నందా! నీకుమారుడు అందరినీ ఆకర్షిస్తాడు కనుక కృష్ణుడు అవుతాడు. కృష్ణ్ఛాయతో అలరారుతున్నాడు పైగా. అంతేకాదు కమలములకు అంత్యంత ప్రియుడు కనుక ‘క’కారము రాముడు కనుక ‘ఋ’కారము, అన్నిసంపదలు కలవాడు కనుక ‘ష’కారము శత్రుభంజకుడు కనుక ‘ణ’ కారము కలిపి కృష్ణుడుగా పేరుపొందుతాడు. కేవలం ఈ యుగంలోనే కాదు కలియుగంలోనూ నీ కుమారుడు కీర్తిపొందుతాడు అని గర్గమహర్షి దీవించాడు. గర్గుని దీవనలు విన్న కృష్ణుని కి మంగళవాచకాలు పలికారు. నందుడు గోవులను, పుత్తడిని దానం చేశాడు. తన కుమారుడు దినదినాభివృద్ధి చెందాలని అందుకు పెద్దల ఆశీర్వచనాలు కావాలని కోరుకుంటూ పెద్దలందరికీ ఆవులను, బంగారాన్ని ఇచ్చాడు. వచ్చిన చుట్టపక్కాలందరికీ వివిధ బహుమతులిచ్చి వారిని సంతోషించచేశాడు.
అలా నామకరణం తరువాత మెల్లమెల్లగా బలరామకృష్ణుడు పెరిగి పెద్దవారు అవుతూ స్నేహితులతో ఆడడం మొదలుపెట్టారు.
‘‘అమ్మా! ఇపుడే వస్తాం’’అంటూ తమ తమ సంగడీల దగ్గరకు పరుగెత్తి వెళ్లేవారు. వారి ఆటపాటలను చూస్తూ వారి ముద్దుమాటలను చూస్తూ ఎంతో ఆనందం అనుభవించేవారు రోహిణీ యశోదలు.
ఓరోజు...
కృష్ణుడు ఉపనందుని ఇంటికి వెళ్లాడు. ఉపనందుని ఇల్లాలు ప్రభావతి చూడకుండా శ్రీకృష్ణ బృందం అడుగు పెట్టింది. మెల్లమెల్లగా అడుగులు వేస్తూ పెరుగుకుండలు దగ్గరకు వెళ్లారు. కృష్ణుడే పెరుగుకుండలో చేయి పెట్టి పెరుగు తీసుకొని తాను తింటూ తన స్నేహితులకు పంచాడు. ఉట్టిమీదున్న వెన్నకుండలను పీటలపై ఎక్కి దించాడు. ఆ వెన్నను తీసి తాము తింటూ అక్కడ చేరిన కోతుల గుంపులకు అందించాడు. దాన్ని చూచిన ప్రభావతి ‘ఏయే’ అని అరుస్తూ ముందుకు రాబోగా ఆమెనుపడవేస్తూ పిల్లలందరూ ఆమె నుంచి తప్పించుకుని పారిపోయారు. ఇలా అందరి ఇండ్లకు వెళ్లి నవనీతాన్ని చౌర్యం చేయడం కృష్ణ బృందం ఆరంభించింది. అందరి కళ్లు కప్పి పరమాత్మనే దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఒకనాడు ప్రభావతి మాటు వేసి కృష్ణబృందాన్ని చేతికి చిక్కించుకుంది.

చరణ శ్రీ