Others

జగదంబకు జేజేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ దేవీ భాగవతము, శ్రీదేవీ సప్తశతి, మహావిద్యా, ఆదిశంకరుల సౌందర్యలహరి, త్రిపుర సుందరీ మానస పూజాస్తోత్రం, మంత్ర మాతృకాపుష్ప మాలాస్తవం, లలితా సహస్రనామం వంటి గ్రంథాలన్నీ ఏకకంఠంతో కీర్తించే ఆదిపరాశక్తిని అఖిలాండేశ్వరీ అఖిల భువనభాండాగారాలను తన కన్ను సన్నులలో వీక్షించి లక్షించే జగదంబను వివిధ రూపాలలో అర్చించడం ఆశ్వీజమాసంలో సంప్రదాయం.
మొదటి రోజు బాలాత్రిపుర సుందరిదేవి
ఈ అమ్మవారు ‘బాలా’గా కదంబవనంలో అగ్నినుండి ఆవిర్భవించింది. 6-10 సం.ల వయస్సు, ఆకర్షణీయ ముఖవర్చస్సు పసితనం మోములో తొణికిసలాడుతుంది. ఇది బాహ్య రూపం. మంత్రోపదేశం తీసుకొని దేవీ నవరాత్రులు చేసేటప్పటి మొదటి రోజు బాలస్థితి. ఈ రోజు బాలాస్త్రోత్ర పారాయణ చేయటం మంచిది.
రెండవ రోజు మహాలక్ష్మి లేదా మహేశ్వరి
ఈ రోజు అమ్మవారు 42 ఆభరణాలు ధరించి ఉంటుంది. పాల సముద్రంలో పుట్టింది. శివుడు ఇచ్చిన అస్త్రంతో అసురులను సంహరించినందుకు ‘మహేశ్వరి’ అంటారు. చక్షరుడు, మహాసురుడు అనే అసురులను సంహరించింది. ధర్మబద్ధంగా సంపాదించి, మంత్రసాధన చేస్తూ ఉంటే ఎంతగా వృద్ధిలోకి వస్తారో చెపుతుంది. ఆవిడే మహాలక్ష్మి ఈ రోజు లక్ష్మీ సోత్ర పారాయణ చేయాలి.
మూడవ రోజు అన్నపూర్ణాదేవి
అలనాడు అమ్మవారు విశాలాక్షియై వ్యాసుల వారి ఆకలిబాధను దూరం చేసింది. కేవలం క్షుద్బాధనే కాదు జ్ఞాన దాహాన్ని తీర్చగలిగే శక్తిస్వరూపిణి అమ్మ. అందుకే అమ్మను అన్నపూర్ణయై ఆదుకోమని పూజిస్తారు. అమ్మవారి అసరుల సంహారంలో అంధకుడు, తామరుడు, ఉద్ధతుడు లాంటి వారు అసువులు బాసారు. ఈ రోజు అమ్మవారి దగ్గర అన్నపూర్ణాష్ట పారాయణం చేయాలి.
నాల్గవ రోజు గాయత్రీదేవి
ఈ రోజు అమ్మవారి అలంకారం గాయత్రిమాత 5 తలలతో ఉంటుంది. తూర్పు ముత్యం, దక్షిణం పగడం, పశ్చిమం బంగారం, ఉత్తర నీల ఆకాశ రంగులో ఉంటుంది. దశభుజియై ఉంటుంది. అమ్మనే స్వయంగా గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పంచభూతాలకి సాక్షిగా అమ్మ ఐదు ముఖాలు ధరించి సాక్షాత్కరిస్తుంది. ఈ రోజు అమ్మవారు శుంభ, నిశుంభులని సంహరించింది. కొన్ని చోట్ల ఈ రూపాన్ని కాళీ రూపం అని కూడా అంటారు. ఈ రోజు గాయత్రి అష్టకాన్ని పారాయణ చేయాలి.
ఐదవ రోజు లలితా త్రిపుర సుందరి
చతుర్భుజాలతో చిరునవ్వును చిందిస్తూ సింహాసనంపై ఆసీనురాలై దర్శనమిస్తుంది అమ్మ. కుడివైపు వినాయకుడు, ఎడమవైపు కుమారస్వామి, కుడివైపు సరస్వతి, ఎడమవైపు లక్ష్మీదేవి వింజామర వీస్తూ వుంటే శంకరుని తో కలసిఅమ్మకూర్చుంటుంది. ఈ రోజు అమ్మవారిని ‘ప్రాతర్నమామి లలితే’ అనే స్తోత్రంతో స్తుతించాలి.
ఆరవ రోజు కాళిక
చండముండులు చేసిన చేష్టలకి అమ్మ రౌద్రరూపం దాల్చి నాలికను బయటపెట్టి చేతిలో రక్తపాత్రతో దర్శనం ఇస్తుంది అమ్మ. నల్లని రూపాన్ని, నల్లని వస్త్రాన్ని ధరించి ఉంటుంది. ఈ అమ్మని ధ్యానిస్తే శుభం. అన్నింటా మంగళం కలిగిస్తుంది. ఇన్ని రోజుల సాధనతో సాధకుడు, ఒంటి భోజనంతో శుష్కించి ఉన్నవాడు కోపానికి లోనుకాకుండా ఉండటానికి అమ్మ రౌద్రరూపం ధరించి ఉంటుంది. ఈరోజుననే సప్తమాత్రుకలు ఆవిర్భవించి మహాసురులను చంపారు.
ఏడవరోజు సరస్వతీదేవి
తెల్లని వస్త్రాలు ధరించి, వీణ చేత పట్టుకొని అక్షమాల పుస్తకంతో తెల్లని హంసపై కూర్చుని ఉంటుంది. వీణలో 24 మెట్లు గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలకి సంకేతం. జ్ఞానానికి మూలమైన అమ్మవారిని మూలానక్షత్రం రోజు సరస్వతి రూపం లో పూజిస్తాం. ఈ రోజు సరస్వతి అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయాలి.
ఎనిమిదవ రోజు దుర్గ
అమ్మ దుర్గయైదుర్గమాలను ఛేదించడానికి ఎనిమిది కళలతో తన్ను తానుసృజియంచుకుని కదనానికి కదలివెళ్లింది దుర్గ. సాధకుడు ఈ ఎనిమిది రోజులు ఉపాసన చేసిన దృష్ట్యా సిద్ధ్ధిత్రి అయి సిద్ధిని ప్రసాదించటానికి ఉద్యుక్తురాలవుతుంది. దుర్గాస్తోత్ర పారాయణం చేయాలి.
తొమ్మిదవరోజు మహిషాసుర మర్దని
మహిషాసుర మర్దిని యై మహిషుడిని నాడు సంహరించింది అమ్మ. నేడు మానవుల్లో ఉండే మహిష లక్షణాలను దునమాడడానికి మహిషిషా సుర మర్దని ఆరాధించాలి. అమ్మస్తుతిలో పశు లక్షణాలు పోయ పశుతత్వానికి దగ్గరవుతాం. మహిషాసుర మర్దని స్తోత్రం పారాయణం చేయాలి.
పదవ రోజు రాజరాజేశ్వరి
అసురులపై విజయోత్సాహం.. రాజరాజేశ్వరీ పూజ. అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు ఉపాసన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. దుష్టశక్తులను నిర్మూలించి దైవీగుణాలను పొందడానికి ఈ శరన్నవరాత్రుల పూజ సద్వినియోగం చేసుకొం టారు. అసుర సంహారం చేసినందుకు ‘విజయదశమి’ జరుపుకొంటారు అదే దసరా.

పద్మావతి పరిమి