Others

నూరు నోములు నోచి ఉయ్యాలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ రన్నవరాత్రుల్లో ప్రధానమైంది శక్తిపూజ. తెలంగాణా ప్రాంతంలో శక్తినే బతుకమ్మగా ఆరాధిస్తారు. తెలంగాణా సంస్కృతిసంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ. కాకతీయుల సామ్రాజ్య కాలంనుంచి కూడా ఈ బతుకమ్మ వేడుకలు ఘనంగాజరిగేవి. భాద్రపద బహుళ అమావాస్య నాడు ప్రారంభమై ఆశ్వయుజ శుక్లఅష్టమి తో ముగుస్తాయి. దుర్గాష్టమితో పరిసమాప్తం అవుతాయి.
బతుకమ్మ ఆదిశక్తి , భూమాత, ప్రకృతి మాత ఆమె మానవాళిని బ్రతికించే అమ్మ కనుక బ్రతుకమ్మ అయిందని ఐతిహాసిక కథనం. తెలంగాణ వ్యావహారికంలో బతుకమ్మ గా మారిందని భాషా శాస్తజ్ఞ్రులంటారు. బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాల గురించి బతుకమ్మ పాటల్లో ప్రతిబింబిస్తాయి. శ్రీమహాలక్ష్మిగా, పార్వతీదేవిగా, పేరంటాలుగా, సాహసవనితగా, ప్రకృతి మాతగా శ్రీచక్రశోభిత వర్ణిస్తూ కీర్తిస్తూ పాటలలో నిక్షిప్తం చేసారు. మహిషాసుర మర్దిని మహిషుడిని సంహరించిన తర్వాత ఆదిపరాశక్తి సొమ్మసిల్లి తిరిగి అష్టమి నాడు శక్తిని కూడగట్టుతూ కళ్లు తెరుస్తుంది. ఈ తొమ్మిది రోజులు పరాశక్తిని ప్రార్థిస్తూ పాటల రూపంలో పూజిస్తూ తమను రక్షించడానికి త్వరగా స్వస్థత చేకూర్చుకోవాలని ఆమాయకంగా ఆమెచుట్టూ తిరుగుతూ స్మరణ చేస్తారు. పరాశక్తికి అలుపేమిటి? ఇలా తొమ్మిదిరోజులు పండుగ చేసుకోవడమే బతుకమ్మ పండుగలోని అంతరార్థమని భక్తుల నమ్మకం. ఈ వేడుకలో మొదటిరోజు బతుకమ్మను గోమయం, ఆవుపేడతో రూపొందించి పూజిస్తారు. చివరి నాలుగు రోజులు వివిధ పుష్పాలతో బతుకమ్మ ను రూపొందిస్తారు. బతుకమ్మ రోజుకో పేరుతో ఆరాధ్చిడం ఈ శక్తిపూజలోని భాగం.
నూరు నోముల నోచి ఉయ్యాలో
నూరు మందిని గాచి ఉయ్యాలో
జగతిపై బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ సంధ్యాసమయంలో చంద్రుని చల్లటి తెల్లని వెనె్నలలో పూల గోపురంగలా పూలతో పేర్చిన బతుకమ్మలను అందరూ ఒక చోట చేర్చి దాని చుట్టూ వలయాకారంలో పాటలతో నృత్యాలతో తప్పిటలతో అందరూ కలసి అపూర్వమైన రీతిలో పండుగ వేడుక జరుపుకోవడం అద్భుత దృశ్యం. ప్రతిరోజూ ప్రత్యేకమైన నివేదనలు కూడా బతుకమ్మకు సమర్పించి వాటిని అందరూ ప్రసాదంగా తీసుకొంటారు.
తొమ్మిదో రోజు బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’ పేరుతో బతుకమ్మను పేరుస్తారు. తత్తిమా రోజుల్లో సాధారణంగా ఉంటుంది. ఆరవరోజు అరిష్టం గా భావించి బతుకమ్మను నిలిపినా ఆరోజు ఆటపాటలుండవు. నవమి నాటి బతుకమ్మను సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఆరోజు పాటలు పాడుతారు. విశేషమైన నైవేద్యాలను సమర్పిస్తారు. అటుపిమ్మట స్ర్తిలందరూ వాయనాల రూపంలో రకరకాల పిండివంటలు ఫల పుష్పతాంబూలాలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. పదిరోజుల పాటు ఆనందలహరిలో ఓలలాడిన స్ర్తిల బతుకమ్మకు ప్రణమిల్లి ఉత్సాహంతో పదిరోజుల సంరంభానిక పరిసమాప్తి పొందుతారు.

ఎ. సీతారామారావు