Others

మేలు మేలు ధర్మాచరణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమశివుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అయ్యాడు. నీకేమి వరం కావాలి అని అడిగితే కాశీరాజు కుమార్తె ఐదుసార్లు పతి అని అడిగిందట. దానితో పరమశివుడు నీకు మరుజన్మలో ఐదుగురు భర్తలు లభిస్తారని వరం ఇచ్చాడు. ఇలాంటి వరం ఏమిటా అని బాధపడే కాశీరాజు కుమార్తె ను పరమశివుడే ఓదార్చి మరేం ఫర్లేదు. నీవు ధర్మయుతంగానే ఐదుగురి భర్తలకు భార్యగా మెలుగుతావు. పరమ పతివ్రతగా పేరు పొందుతావు అని కైలాస వాసుడు వరం ఇచ్చాడు. దీనివల్ల కూడా ఆమె ద్రౌపదిగా మారింది.
పరమశివుని వరం ప్రకారం వీరు ఐదుగురిని ద్రౌపదినివివాహం చేసుకోవచ్చు అని వ్యాసుడు చెబుతూ ద్రౌపది పూర్వజన్మను, ధర్మరాజాదుల పూర్వజన్మలను కూడా చర్మ చక్షువులకు ధృతరాష్ట్రాదులకు చూపించి వారిలో సంశయాలను దూరం చేసినట్లు మహాభారతమే మనకు చెబుతుంది.
అంతేకాదు ఈ ద్రౌపది పూర్వజన్మలో లక్ష్మీఅంశ. ఈమె సీతమ్మవారు రావణునితో వెళ్లకముందే లక్ష్మీ ఛాయను అగ్ని వేరుగా చేసాడట. ఆ ఛాయనే తపస్సు చేసి ద్రౌపదిగా పుట్టిందని కూడా పురాణాలు వివరిస్తున్నారు. ఇక ప్రజలో ప్రచారంలో ఉండే కథలెన్నో ఉన్నాయ. అవి అన్నీ కూడా జనులందరినీ ధర్మాచరణలో ఉండేటట్టు చేసేవి అని చెప్పవచ్చు. ఇక ఇంద్రాణినే కన్యకాంబగా పుట్టింది. ఆ కథను పరిశీలిద్దాం.