Others

చిన్నివానిలో చిన్మయత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓరోజు ఓ గోపకాంత తన విభుని కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంది. ఆమె దగ్గరకు వెళ్లాడు కృష్ణయ్య! ‘ఎవరికోసం చూస్తున్నావు ’అని ఆ యువతి అడిగాడు. తన మగని కోసం అంటే వాడు అంత మంచివాడు కాడు నన్ను మగనిగా చేసుకోరాదా? అంటూ ఆ అమ్మాయిని ఏడిపించాడు. ముద్దులు మూటగట్టే యశోదానందుడు గోపకాంతలు వారి వారి పాలుపెరుగు కుండలను పగులగొట్టి వారిని ఏడిపించేవాడు. వీని బాధ పడలేని గోపకాంతలందరూ ఒకనాడు యశోదమ్మ దగ్గరకు వచ్చి కృష్ణుని మీద ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు.
ఓ గోపకాంత .. ‘ఓ యశోదమ్మా! నీకొమరుని అల్లరిని మేం భరించలేకపోతున్నాము. అతడు మా ఇంట్లో నా కొడుకు జుట్టుకు లేగదూడ తోక తో కలిపి కట్టివేశాడు. ఆ లేగదూడ అడుగులు వేసుకొంటూ ముందుకు పోయింది. పాకే వయస్సున్న నాకుమారుడు ఏమైందో తెలియక ఉగ్గుపట్టి ఏడుస్తూ నాకు కనిపించాడు. ఎవరీ పని చేసింది అని నేను చూస్తుంటే మీ కృష్ణుడు దాక్కొని ననే్న చూస్తూ నవ్వుతున్నాడు.’అంది
అంతలో మరో యువతి ‘ఇక మా ఇంట్లో సంగతి చెబుతాను వినమ్మా!మా అత్తగారంటే నాకు చాలాభయం. ఆమె నోరు తెరిస్తే ఊరువాడ ఏకమవుతుంది అని నేను ఎన్నో విధాల ఆమెకు అనుగుణంగా పని చేసుకొని పోతుంటాను. అట్లాంటి నేను మధ్యాహ్నం పూట కాసేపు పడుకున్నాను. అంతే నీ ఈ కృష్ణుడు మా ఇంట్లో వెన్నమీగడలంతా తినేసి ఆ చేయి తెచ్చి నిద్రపోతున్న నా ముఖానికి నా చేతులకు పూసేసిపోయాడు. నేను కలవరపడుతుంటే మా అత్త చూచి నేను పెరుగు వెన్నకుండలను ఖాళీ చేశానని నన్ను నానామాటలు అంది. ఇంకా ఆమె నన్ను అంటుంటే కృష్ణుడు ఆమె పక్కన చేరి ఇంకా నాపై ఎక్కిస్తున్నాడు. ఇది ఏమన్నా బాగుందా అమ్మా!’అని అడిగింది.
అంతలో మరో మధ్యవయస్సు గల ఇల్లాలు ‘అమ్మా! యశోదమ్మా! నేను మా ఇంట్లో పూజ చేసుకొంటూ వుంటే మా ఇంట్లోకి ఎప్పుడు వచ్చాడో నీకుమారుడు నేను చూడనేలేదు. వచ్చి నేను నైవేద్యానికి తయారు చేసిన పాయసాన్నాన్నంతా తాను తినేసాడు. పోనీలే అని నేను అనుకొంటుండగా ఆ ఎంగిలి చేతులతో నేను పూజచేసుకొనే పటాలన్నిటిమీద ఎంగిలి పూసాడు. పైగా వీరంతా నీ ఇలవేల్పులా నేను కాదా నేను దేవుడినా వీళ్లా అంటూ వాటిని కింద పడవేసి పోయాడు. ఏమని చెప్పను వీని అల్లరి. నీవు ఇక కట్టడి చేయకపోతే లాభం ఉండదు అమ్మా’ అంది.
‘అయ్యోవదినా! కట్టడి ఏమిటి కట్టడి. నేను కృష్ణుని అల్లరి పనులు తట్టుకోలేక ఒకనాడు వీనిని పట్టుకొని మా ఇంటి గదిలో బంధించి నా స్నేహితురాలని తీసుకొని వచ్చి ఈ యశోదమ్మతో చెబుదామని పక్కింటికి వెళ్లాను. అక్కడ ఆమె కూడా కృష్ణయ్య పట్టుకుందామని కృష్ణుని వెనుక పరుగెడుతూ ఉంది. చివరకు పట్టుకుని తాళ్లతో బంధించింది. నేను అది చూసి విస్తుపోయి మా ఇంట్లో ఉన్నాడు కదా అనుకుని మళ్లీ పరుగెత్తుకు ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి నేను బంధించిన గది నంతా చిందర వందర చేసి బాగయిందా అంటూ నన్ను వెక్కిరిస్తున్నాడు. నేను మళ్లీ వాళ్లింటికి వెళ్లేసరికి అక్కడ కృష్ణుడు ఆమెను ఎగతాళి చేస్తున్నాడు. నేను ఏమి చూస్తున్నానో ఏది చూడట్లేదో తెలియక గందర గోళంలో యశోదమ్మ దగ్గరకు రాబోతుంటే రాధమ్మ ఇంట్లో కృష్ణుడు వెన్నమీగడలు గోడపై నుంచి కోతులకు పెడుతూ కనిపించాడు. ఇక్కడి ఎలా వచ్చావు మరలా అని నేను అడుగుతుంటే ‘‘నేను ఎక్కడలేను రావడానికి ’’అని ననే్న అడుగుతున్నాడు. ఇది చిత్రమా ! విచిత్రమా!’’అని ఆమె ఆశ్చర్యంతో చెబుతోంది. ఇలా ప్రతివారు కృష్ణుని గురించి ఎన్నో తప్పులు ఎగ్గులు చెబుతున్నారు.
కాని యశోదమ్మ ఒడిలో కూర్చుని ఉన్న కృష్ణుడు వీరు చెప్పేవన్నీ విని ‘‘అమ్మా ! అమ్మా! వీళ్లు చెప్పేవన్నీ అబద్దాలే ! నీవు వినకు అమ్మా అసలు నమ్మకు. ఇదిగో నా స్నేహితులు ఇక్కడే కదా ఉన్నారు. నేను నీ దగ్గరే ఉన్నాను కదా... వీళ్లు అన్నీ నాపై నిందలు మోపుతున్నారు’అని బుడి బుడిరాగాలు తీస్తూ అన్నాడు.
యశోదమ్మకు తన కొడుకుపై ఎక్కడలేని అభిమానం వచ్చింది. వెంటనే కృష్ణుని ముద్దాడుతూ తన కొంగు ను కప్పి కృష్ణు ని దాచేసి ‘‘ ఏమి అమ్మలమ్మా మీరు మీకు కూడా కొడుకు వున్నారు కదా. నేను ఎప్పుడైనా మీ కొడుకులపై నిందలు మోపానా? పోయిరండమ్మా! నాకొడుకు అమాయకుడు మీరు చెప్పేవన్నీ మీకొడుకులు చేస్తున్నారేమో చూసుకోండి. మా ఇంట్లో ఏమైనా పాలు పెరుగు తక్కువ ఉందా మీ ఇంటికి రావడానికి చాలు చాలు ఇక ఈ నిందలు ఆపి వెళ్లిరండి ’’ అని వారితో చెప్పేసి వారు మాట్లాడడానికి ఇంకో అవకాశం రాకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది యశోదమ్మ.

- చరణ శ్రీ