Others

మాటే వేదం.. మాటే మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాట బహుళ ప్రయోజనకారి! అమ్మో! ‘మాటే’ చాలా ప్రమాదకారి! నిజమే అగ్ని లాంటిదే మాట. జాగ్రత్తగా వాడితే అగ్నివలన ఎన్నో ప్రయోజనాలున్నట్టే, అలానే దురుపయోగం చేస్తే ఎన్నో ప్రమాదాలుంటాయి. అగ్గిపుల్ల దీపాన్ని వెలిగిస్తుంది... గడ్డి కుప్పని కాలుస్తుంది. వాడుకోవడంలోనే ఉంది. అలానే మాట కూడా. అగ్నిని వాడుకోవడానికి కాస్త అవకాశం ఆలోచన వుంటుంది, మరి ఒక్కొక్కసారి మాట విసుర్లకు అట్టి అవకాశం చూసుకోవడం వ్యక్తి చేయడు. ‘మాట’ అగ్నితో సరిపోల్చడం కూడా ఒక కారణం, సారూప్యం ఉన్నాయి. అంతఃకరణ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, నాల్గింటిలో బుద్ధినుండే ‘మాట’ వస్తుంది కదా! బుద్ధికి అధి దేవత అగ్ని. ఆ విధంగా కూడా అగ్నికి, మాటకి పోలిక చెప్పవచ్చు. కోపంతో వచ్చిన మాటలు నిప్పు కణాల్లా ఎదుటివారిని కాలుస్తాయని అంటారు. మాట బహుళార్ధ సాధనం, బహుళ ప్రయోజనకారి. ఏ మాట ఎక్కడ మాట్లాడినా మంచిదైనా, చెడ్డదైనా ఎన్నో జతల చెవులకు రిజిస్టరు అయిపోతుంది. పబ్లిక్ వ్యక్తులకైతే మరీను!ఏం మాట్లాడినా వెనక్కి తీసుకోలేరు. అందుకే ఆచి తూచి మాట్లాడాలనేది. తేడా జరిగితే మాటతో ఒకటే గందరగోళాలు సృష్టించబడతాయి! సభలో వాగ్వివాదాలు, అల్లర్లు, ఒకటేమిటి నానా రభస జరుగుతుంది. గతించి వెనక్కు తేలేని వాటిలో కాలం, జననం, మరణం. వీటితోపాటు మాటను కూడా చేర్చవచ్చు. కాలం గడిస్తే వెనక్కు తిరిగి రాదు. అలానే ఒకసారి జననం-మరణం జరిగితే మరలా అవి రావు. మరో జన్మ మరో జీవి, మరో మరణం కాని ఈ శరీరం ఉపాధి జనన మరణాలు మరల రావు. మరో ఉపాదులు వస్తాయి.
అలానే మాట విసిరినా జారినా అసంకల్పితంగా, అనాలోచితంగా తీసుకోవడం కష్టం. అందుకే పెద్దల సూక్తి ఉండనే ఉంది. కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేం అని. ‘సత్య సంధత కలిగిన మాట వేదంలా మంత్రంలా పని చేస్తాయని చెప్పవచ్చును. కలకాలం ఆ మాట సత్యత, స్వచ్ఛత, ప్రకాశం వెదజల్లుతు వుంటుంది. శాశ్వతత్వం కలిగి గ్రంథస్థం కాబడుతుంది. అలానే దుష్ట మాటలు దుష్ప్రభావం కలిగిస్తాయి. సత్యం కటువుగా, చేదుగా, అప్రియంగా వున్న ఔషధం చేదు అయినా రోగ నిరోధకానికి సేవించినట్లే సత్యాన్ని కలిగించే మాట స్వీకరించక తప్పదు. అందుకే పెద్దలు అంటారు. అప్రియం అయినా, వాస్తవం యదార్ధం కటువుగా వున్నా ప్రియమైన మాటలతో చెప్పాలనే. మనం ఏమి మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నామన్న దానికే ఎక్కువ ప్రాధాన్యం. మాట్లాడే విధానం మీదనే విషయం ఆధారపడి ఉంటుంది. బయట మాట్లాడితే కదా ఎవరైనా పట్టుకుంటారు. నోరు విప్పిన వాని చుట్టూ ఎన్నో జతల చెవులు రికార్డు చేస్తుంటాయి. వింటాయి. మాట వలన భాష సంస్కారం కడా తెలియగలదు. చదువులో కాని ఉద్యోగ వ్యాపారాల్లో కాని రాణించాలంటే సందర్భోచితంగా చక్కగా మాట్లాడడం రావాలి. పెద్దలతో ఎలా మాట్లాడాలో, తన సమ వయస్కులతో ఎలా మాట్లాడాలో చిన్నవారిని ఎలా పలకరించాలో తప్పనిసరిగా తెలిసి వుండాలి. పెద్ద పెద్ద పరీక్షలు వ్రాతలో నెగ్గినా, తర్వాత వౌఖిక పరీక్షలో చక్కగా సమాధానాలు చెప్పేవారికే విజయం. అనుచితంగా మాట్లాడరాదు. ఇతరుల మనసు నొప్పించరాదు. అనవసరంగా కనుబొమ్మలు ఎగురవేయడం, చేతులు తిప్పడం మాట్లాడేటప్పుడు మానుకోవాలి. పురాణాల్లోని శిశుపాలుడు, దుర్యోధనుడు వంటివారు అధోగతి పాలు కావడానికి వారి చెడ్డమాటలే. ఊరికే నోరు పారేసుకోవడం, అదే ఏదిపడితే అది మాట్లాడడం మంచిది కాదు. సమయం, సందర్భం లేకుండా చూసుకోకుండా మాట్లాడితే చివరికి తనే అవమానాలపాలవుతాడు. శిశుపాలుడు సభలో శ్రీకృష్ణుని నిందించి తూలనాడి చివరకు సుదర్శన చక్రం చేత సంహరించబడడం జరిగింది కదా!

- ఎ.నాగభూషణరావు