Others

అతి ఎక్కడా పనికిరాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పుట్టుక గిట్టుక మధ్యలో నిత్యమూ సత్యమూ అయన భగవంతుని గూర్చి ఆలోచించాలి. తెలుసుకోవాలి. ఆయన్ను అనే్వషించాలి అనుకొనేవాణ్ణి. ఇన్నివిషయాల పట్ల వ్యతిరిక్తమైన నా మనసు మాత్రం శ్రీమన్నారాయణుని నామంతో పులకించిపోయేది. కేవలం శ్రీహరి నామం తప్ప మరో ధ్యాస లేకుండా నా జీవితాన్ని గడుపాలని నిశ్చయంచుకుని రోజుల్ను గడుపుతున్నాను. నా నోరు శ్రీహరి నామం తప్ప మరొకటి పలుకకుండా చేసుకొన్నాను.
అట్లాంటి రోజుల్లో ఒకరోజు నదీస్నానానికి వెళ్లాను. ఆ నదీ తీర ప్రాంతంలో ఉన్న ప్రశాంతత చల్లని చెట్లు అవి చూస్తూ ఆహా ఈ ప్రకృతి రమణీయతలోనే శ్రీహరి వసించినట్లు ఉన్నాడు కదా అనుకొంటూ నదీస్నానం ఆరంభించి సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తున్నాను.
అక్కడ గర్భవతి యైన ఓ లేడి వచ్చింది. కాస్త కష్టపడుతూ మెల్లమెల్లని అడుగులు వేసుకొంటూ నది దగ్గరగా వచ్చి ఆ నీటిని తాగుదామని నోటిని తెరిచింది. అంతలో భీకరమైన సింహ గర్జన వినిపించింది. దిక్కులు పిక్కట్లేల్లాలా వచ్చిన ఆ గర్జన విని వినగానే నీళ్లుతాగబోయిన ఆ హరిణం భీతితో చెంగున ఎగిరి అంతలోనే ఓ రాయిపై పడిపోయింది. ఆ విసురుకు ఆ హరిణం తల రాయికి కొట్టుకొని తల పగిలిపోయింది. అపుడే ఆ లేడికి ప్రసవం జరిగిపోయింది. చిన్న హరిణపు శిశువు రోదించసాగింది. ఆ తల్లి హరిణం ప్రాణాలు గిలగిలాడాయి. కాని క్షణంలో ఆ హరిణం రక్తమడుగులో చివరి శ్వాస వదిలింది. ఇదంతా అనుకోకుండా రెండు నిముషాల వ్యవధిలో జరిగిపోయింది.
అనాలోచితంగానే నేను ఈ ధృశ్యాన్నంతా చూచాను. నామనసు ఆ విధిరాతకు ఆక్రోసించింది. దయార్ధ్ర హృదయమైన నా మనసు ‘అయ్యో ! పుట్టీ పుట్టగానే తల్లి ని కోల్పోయిన ఈ హరిణ శిశువు ఎలా బ్రతుకుతుందో కదా. ఈ నిర్జనారణ్యంలో పులులు, సింహాలు, ఎలుగులు, ఏనుగులు ఏవైనా భీతికొల్పించేవే. అయ్యో వాటి వలనే కదా ఈ తల్లి హరిణం ప్రాణాలు పోగొట్టుకొంది అని అని విలపించింది. వెంటనే నేను నియమానుసారంగా చేస్తున్న ఆర్ఘ్యపాద్యాదుల విషయం మరిచిపోయాను. తటాలున వెళ్లి ఆ శిశువును చేతుల్లోకి తీసుకొన్నాను. ఆ బిడ్డ శరీరాన్ని నెమరుతూ వాత్సల్యపు రుచిని చూపిస్తూ భయం పోగొట్టాను. నిజానికి అపుడు నా మనస్సెంతో హాయపొందినట్లు నాకు అనిపించింది. నేను సమయానికి ఈ ప్రాణిని బతికించగలిగాను అనే సంతోషంతో
నా ఆశ్రమానికి తీసుకొని వచ్చాను. నేను తిందామని ఏరుకొచ్చిన ఫలాలను ఆ లేత లేడికి తినిపించాను. తినలేకపోతుందేమో నంటూ ఆ పండ్లను నేనే వలచి గుజ్జుగా చేసి మరీ తినిపించాను. ఇలా ఆ హరిణంపై నాలో ఫ్రేమ అంకురించింది.
కాని నేను మాత్రం అనుష్ఠానం మానకుండా చేస్తునే ఉన్నాను. కాని నాలో ఆ హరిణంపై నాకు తెలియకుండా అవాజ్యమైన ప్రేమానురాగాలు దినదినానికి ఎక్కువ అవుతున్నాయ.
హరిణాన్ని కన్న బిడ్డలకంటె అధికంగా ప్రేమిస్తున్నానని నేను తెలుసుకో వడానికి నాకు చాలా కాలం పట్టింది. నేను నదీస్నానానికి వెళ్లినా, గాయత్రీ మంత్రాన్ని సాధన చేస్తున్నా హరిణంపై ఒక చూపును వేసే ఉండేవాడిని. కంటికి రెప్పలాగా ఆ హరిణాన్ని నేను పెంచుకుంటున్నాను. అది కాసేపు కనబడపోతే నా ప్రాణం విలవిలలాడుతున్నట్టుగా తపించిపోయేవాడిని. చూస్తున్నారా విధిమాయ.
- ఇంకా ఉంది

- రాయసం లక్ష్మి