Others

వాత్సల్యం కురిపించేవాడే వత్సాసుర భంజనుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరుగుపరుగన వచ్చి తన ప్రతిబింబాన్ని చూపిస్తున్న కృష్ణయ్యను చూచి అయ్యో ఎంత అమాయకుడో నా కుమారుడు. అనుకొంటూ నా తండ్రీ! ఇది నీ బింబమేనురా నాయనా. ఇది బూచాడు కదా.. నీవు అల్లరి చేస్తూ పొరుగిండ్లకు పోతే అక్కడ బూచాడు ఉండి నిన్ను పట్టుకుపోతాడు. అందుకే నీవు ఎక్కడికి పోవద్దు కన్నా అంటూ యశోదమ్మ ముద్దుచేస్తోంది. కృష్ణయ్య ఆ తల్లి అనురాగానికి తన్మయుడై చిన్నవాడై ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
నందాదులంతా సమావేశం అయ్యారు. బలరామకృష్ణులకు వచ్చే ఆపదలన్ని మాట్లాడుకున్నారు. వారిలో ఉపనందులను వారు మనకు దగ్గరలో నే బృందావనమనే ప్రదేశం ఉంది కదా. అక్కడ పశువులకు, మనకు ఎంతో అనువైన పరిస్థితి ఉంటుంది. కనుక మనమంతా అక్కడి వెళ్లితే ఎంతో బాగుంటుంది కదా. అక్కడైతే మన జోలికి ఏ దుర్మార్గులు వచ్చే వీలుండదు అని చెప్పాడు. అందుకు అందరూ సమ్మతించారు. నందుని మాట విని అందరూ బృందావనానికి బయలుదేరారు. బండ్లనిండా వస్తువులు పెట్టుకొని తాము కూడా ఆ బండ్లల్లో ఎక్కి బృందావనానికి అందరూ బయలుదేరారు.
ఒక బండిలో బలరామకృష్ణులు, యశోద రోహిణి కూర్చున్నారు. రోహిణియశోద వారిద్దరూ ముద్దుముచ్చట్లతో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. బలరామకృష్ణులిద్దరూ వాళ్ల అమ్మలకు ఎన్నో విషయాలు చెబుతూ వెళ్తున్నారు. పరమాత్మనే ముందు పెట్టుకొని ఏ కోరికా కోరకుండా ఆ పరమాత్మ ఆనందంతో తాము ఆనందించే ఈ భామలిద్దరూ ఎంత పుణ్యాత్ములో కదా అని శ్రీకృష్ణుని గురించి తెలిసిన వారు అనుకొంటున్నారు.
బృందావనం అందరూ చేరి అక్కడ వారికి వలసినట్టు ఇళ్లు నిర్మించుకున్నారు అక్కడే ఏ భయం లేకుండా నివసించవచ్చుననే ఊహతో వారు ఉంటున్నారు.
అక్కడే గోవులను కాయడానికి గోపబాలకులతో పాటు శ్రీకృష్ణబలరాములు కూడా సిద్ధమయ్యారు.
ఒకరోజు పిల్లలంతా కలసి ఆవులతో దూడలతో ఆడుకుంటున్నారు. వారు కూడా గో వృషభాల వేషం వేసుకొని మరీ ఆడుకుంటున్నారు. ఈ సంగతి శ్రీకృష్ణుని చంపాలన్న నిర్ణయం ఉన్న వత్సాసురుడు, బకాసురుడను రాక్షసులు తెలుసుకొన్నారు. వత్సాసురుడు దూడ లాగా తయారై కృష్ణుని వెంట వెళ్తున్నాడు. ఈ సంగతి కృష్ణునికి తెలియకుండా ఉంటుందా . తెలియదని ఆయన వెంటే ఈ రాక్షసుడు వెళ్తూ సమయం చూసి శ్రీకృష్ణుని చంపాలని తిరుగుతున్నాడు.
***

- చరణ శ్రీ