Others

ప్రేమించు.. ప్రేమను పంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవంబరు 23 సత్యసాయ జన్మదిన సందర్భంగా ..
*
‘‘బంగారు’’ అనే ప్రేమతో పిలిచే పుటపర్తి సాయి పిలుపు అందరినీ ఆకర్షించేది. బాబాకు దగ్గర చేసేది. ఎదుటివారిలో ప్రేమను నింపేది ఆ బంగారు అన్న పదమే.‘‘ నీవు ఇతరులకు సాయం చేసే గుణంతో జీవించు. ఒకవేళ నీకు ఆపదలు వస్తే భగవంతుడు వేయి చేతులతోనిన్ను కాపాడుతాడు ’’ అని సాయి బోధన సాగేది.
మానవసేవే మాధవ సేవ, నరుని సేవే నారాయణుని సేవ ఇలా అనేవారంతా సత్యసాయి భక్తులే. పరమాత్మనే సాయి రూపం లో అవతరించారని సత్యసాయి భక్తులంతా నమ్ముతారు. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. సత్యసాయి ప్రేమరూపుడు. ఆయన ఏ ఉపన్యాసం ఇచ్చినా, ఏ గీతం ఆలపించినా అది ప్రేమరూపానే్న సంతరించుకొనేది. ప్రకృతిని, మనిషిని ప్రేమించు. ఆ ప్రేమించేగుణమే పరమాత్మ స్వరూపమని సాయి అనేవారు. ‘‘నా జీవితమే నా సందేశం ’’అని సేవాధర్మాన్ని ఆయన పాటించిచూపారు.
ఆధ్యాత్మిక ప్రబోధం అంటే అది సమాజసేవ అన్న మానవతామూర్తి కరుణరస స్వరూపుడు భగవాన్ సత్యసాయి బాబా. కరువుతో అలమటిస్తున్న రాయలసీమ గ్రామాలకు త్రాగునీరు అందించిన అపర భగీరథునిగా ఆ రాయలసీమ వాసులు సాయిబాబాను కొనియాడుతారు. సహాయం చేసే గుణమే దైవగుణంగా భాసిస్తుందని చెప్పేవారు. ఆయన స్వయంగా చేసి చూపేవారు. సత్యం, ప్రేమ, శాంతి, అహింస అనే ధర్మసూత్రాలను ప్రతిమానవుని అంతరంగలో విల్లివిరియాలని బోధించేవారు. సాక్షాత్తు శివస్వరూపమే సత్యసాయిగా అవతరించారని సాయి భక్తగణం చెప్తారు. మంగళస్వరూపుడు శివుడు. ప్రేమ స్వరూపుడు సత్యసాయి బాబా. ప్రేమతో శివరూపమే సత్యసాయిగా , భగవాన్‌గా కీర్తిగాంచాడు. ప్రేమతో మాట్లాడు.ప్రేమగా ఆలోచించు. ఫలితం అనుకూలంగా ఉంటుందనేవారు.
ప్రేమ తత్వాన్ని పెంచుకుని అందరికోసం సహజీవన మార్గంలో ప్రయాణించడానికి తగిన విధంగా విద్యార్థులే కాకుండా ప్రతి ఒక్కరూ మానసిక చైతన్యాన్ని అలవర్చుకోవాలని సాయిబాబా ఉద్బోధించేవారు. అందరి పట్ల ప్రేమభావాన్ని కలగి ఉండటాన్ని మించిన ఉత్తమ గుణం మరొకటి లేదనేవారు. అందరితో ప్రేమతో మసిలితే చాలు అపుడు హింసకు తావేవుండదు అని ఆయనభావించేవారు. అదే అందరినీ భావించమని చెప్పేవారు.
యువత సేవాభావాన్ని, విశాల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. సాయిపుట్టపర్తిలో నివసించడం వల్ల పుటపర్తిసాయిగా పేరుగాంచారు. ప్రేమను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు పుటపర్తిలో ఈశ్వరమ్మ, పెద్దవెంకప్పరాజు అనే దంపతులకు 1926 నవంబరు 23న సత్యనారాయణ రాజుగాజన్మించారు. బుక్కపట్నం, ఉరనకొండలో ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. ఆ కాలంలోనే అంటే విద్యార్థి దశలోనే ఎన్నో మహిమలను తన తోటివారికి చూపించి వారిని ఆశ్చర్యానందాలకు లోను చేసేవారు . 14 ఏళ్లప్రాయం నుంచే తాను శిరిడీ సాయి బాబా అవతారమని చెప్పేవారు. 1958లో ‘‘సనాతన సారథి’’ అనే అధికారిక మాస పత్రికను సాయి ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 166దేశాల్లో 10,000 సాయి సేవా కేంద్రాలున్నాయి. బాబాను అనుసరించేవారి సంఖ్య ఇంత అని చెప్పడం చాలా కష్టం. మతసామరస్యం, సకల ప్రాణుల పట్ల ప్రేమ, అహింస అనేవి మాత్రమే వీరి తత్వాలుగా మనకు కనబడుతాయి.
ప్రశాంతినిలయంలో బాబా చేసిన ఉపదేశాలు నవతరానికి మార్గదర్శకాలు. మాతృమూర్తులే సమాజాన్ని తీర్చిదిద్దుతారని స్ర్తిలను గౌరవించడం అందరి కర్తవ్యమని ఆయన బోధించారు. ఇంద్రియ నిగ్రహం అందరికీ ఉండాలని దానికోసం ధ్యానం చేయమని చెప్పేవారు. ధ్యానంతో ఏ పనినైనా సులువుగా సాధించవచ్చు అని చెప్పేవారు. ఈరోజు ఏ పనినైనా ప్రేమతో మొదలు పెట్టు. ఇతరుల కోసం ప్రేమగా సమయం వెచ్చించు, రోజంతా నీలో ప్రేమను నింపుకో ప్రేమతోనే రోజును గడుపు- ఇలా ప్రతిరోజు చేసావంటే నీవే పరమాత్మ స్వరూపుడివి అవుతావు అనేవారుబాబా. సంతృప్తిగా జీవించండి. మీలో ఉన్న దైవాన్ని గుర్తించండి. మీరే దైవ స్వరూపులుగా ప్రేమతత్వాన్ని పెంపొందించుకోండి మీకు ప్రతివారిలో భగవంతుని స్వరూపం కనిపిస్తుంది అన్న సాయి మాటలు ప్రతివారు నిత్యస్మరించుకోవాల్సిందే.
బాబా విద్య, వైద్యాలకు సంబంధించిన సేవాసంస్థలనె్నంటినో ప్రారంభించారు. అవి నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. బాబా చూపిన బాటలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి

- కె.రామ్మోహన్ రావు