Others

అంతా కృష్ణమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృ ష్ణా! కృష్ణా అవి తలలూపాయి. ఇక నీ మాట కాదని అవి ఎటూ పోవు. మనం నిశ్చింత. నీకు చెబితే చాలు. నీవు మా మాట వింటేచాలు. మాకు బోలెడంత నిశ్చింత. అన్నాంతా ఒకేసారి .
కృష్ణుడు వారితో చిరునవ్వు చిందిస్తూ తాను కూడా పరుగెత్తి వెళ్తూ నన్ను ముట్టుకోండి చూద్దాం అన్నాడు.
అంతే అందరూ ఆ యశోదమ్మ బాలుని వెంట పరుగెత్తారు. గోవుతోడి వత్సము వెంబడించినట్టుగా.
సూర్యుడు నడినెత్తి మీది నుంచి కిందకు జారబోతున్నాడు. అందరి కడుపులూ నకనకలాడుతున్నాయి. ఆకలికి తట్టుకోలేని ఓ అర్భకుడు
‘‘కృష్ణా! నాకు చాలా ఆకలి వేస్తోంది . ఇక మనం తిందామోయ్ ’’అన్నాడు.
అంతే అవును అవును అంటూ వారి వారి చిక్కాలను తెచ్చుకున్నారు. అందరూ కలసి గుండ్రంగా కూర్చున్నారు. ఒక్క కృష్ణుడు మిగిలాడు. ఎవరికి వారు నా పక్క నాపక్కన కూర్చో అంటూ కృష్ణుని పట్టి కూర్చోబెట్టుకోబోతున్నారు. కృష్ణుడు కూర్చుంటున్నాడు. మళ్లి వేరొకరు వారి వైపుకు లాగితే అటు వెళ్తున్నాడు. కృష్ణుడు దూరమైన వాడు బుంగ మూతి పెట్టి కృష్ణా నా దగ్గర కూర్చోవా అని అడుగుతున్నాడు.
ఇదంతా చూస్తున్న ఒక పిల్లల్లో పెద్దవాడు ‘ఓయి! ఎందుకిన్ని కొట్లాటలు. కృష్ణయ్య! నీవు మధ్యలో కూర్చో. అపుడు తామరపూవులోని దుద్దు లాగా ఉంటావు. మేమంతా తామరపూరేకుల్లాగా కూర్చుంటాం. చూచేవారికి కృష్ణపుష్పంలాగా మనం కనిపిస్తాం. మనందరమూ కృష్ణుని చూడవచ్చు. కృష్ణుడు మనందరనీ చూడవచ్చు. ఇలా కూర్చుంటే అట్లా ఉంటుంది. మరి మీరేమంటారు’’అన్నాడు.
అవును అవును అంటూ కృష్ణుని తీసుకొచ్చి మధ్యన కూర్చోబెట్టారువారంతా.
***
‘‘పిల్లలు దైవంతో సమానమని ఈ మానవులు అనుకొంటారు కదా. చూశారా చతుర్ముఖులుంగారు. ’’
‘‘ అయితేం ఏంటటా? వీణాపాణీగారు’’ అన్నాడు బహ్మ్ర. వీరిసరసాలు వినబడి బ్రహ్మచారి నారదుడు నవ్వుకుంటున్నాడు. దంపతులు దంపతులే సుమా. వీరి కీచులాటలు ఎక్కడున్నా , ఏవిషయానికైనా ఉంటాయి. అనుకొన్నాడుమనసులో.
***
‘‘ఉరేయ్ ఉరేయ్ పిల్లలు నేను ఒక ఆట చెప్పనా ఎంత బాగుంటుందో అన్నాడు ’’మురారి. తాను పెద్దవాడన్నట్టుగా ‘‘అరే ఆకలి వేస్తోంది. తిందాం అని కూర్చుంటే నువ్వు ఏంటిరా ఆట అంటావు ’’అన్నాడు కన్నయ్య.
‘‘ఇదీ తినే ఆటనే. తింటూ తింటూ ఆడుకోవచ్చు ’’అన్నారు మురారి
‘‘అయితేచెప్పు చెప్పు కాదుకాదు మొదలెట్టు ’’అన్నాడు.
ఇదిగోనన్ను మోహినీ అనుకోండి. మీరు కూర్చున్నవారిలో ఒకవైపు దానవులు అనుకోండి . అదిగో ఆ ఎండిన చెట్లకొమ్మలు మీ తలలో దూర్చుకోండి అవి మీ కొమ్ములు.
ఇదిగో ఈ సగంవైపు వారు ఈ పూవులు తలలో దూర్చుకోండి. మీరు దేవతలు. నేను ఏమో మోహినీ అవతారుడను. నేను మనం తెచ్చుకున్న పదార్థాలను నేను ఇస్తూ ఉంటాను. మీరు తింటూ ఉండండి. అదీ ఆట ’’అన్నాడు వాడు.
‘ఓ.. నాకు అర్థమైంది. అబ్బో నీవు అమృతాన్ని పంచుతావన్నమాట. వెళ్లు వెళ్లు నీ అమృతాన్ని తీసుకొని రా’’అన్నారంతా ఒకేసారి.
‘‘మరి నీవు చీర కట్టుకోవాలి కదా.. నీకు జడ ఏది ’’ మాకైతే కొమ్ములు పూవులు అన్నావు. మరి నీకు చీర ఏది ’అన్నారంతా వారు.
వెంటనే ఒక్క గెంతుగెంతి పొదల్లోకి వెళ్లాడు . వీళ్లంతా వాడు వెళ్లిన దిక్కు వంక చూస్తున్నారు.
అంతే పొడవుగా పెరిగి, దట్టంగా ఒకదానిలో ఒకటి కలసి పోయినట్టు ఉన్న తీగలను తాను ధరించిన ఉడుపులకు చుట్టుకున్నాడు. తలలోనిండా పూవులను ఒకదానిలో ఒకటి దూర్చి మాలలా తీర్చి దాన్ని తలనుంచి వేలాడేటట్టు తలలో తురుముకున్నాడు.
మెల్లమెల్లగా అడుగులో అడుగు వేస్తూ వస్తున్నాడు మురారి.
* * *

చరణ శ్రీ